రేపు తిరుపతిలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. శ్రీకాళహస్తిలో జనసేన నాయకుడు కొట్టే సాయిపై సీఐ దాడి, అనుచిత వ్యవహారంపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. సదరు సీఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయనున్నారు పవన్ కళ్యాణ్.ఇందులో భాగంగానే..రేపు తిరుపతిలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. అనంతరం ఎన్డీఏ సమావేశంలో పాల్గొనడానికి ఢిల్లీ పయనం కానున్నారు. కాగా, శ్రీకాళహస్తి సిఐ అంజు యాదవ్ ఇటీవల ఓ నిరసనలో పాల్గొన్న జనసేన నేతపై దాడికి పాల్పడ్డ విషయం తెలిసిందే. శ్రీకాళహస్తిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపడుతున్న జనసేన కార్యకర్తలను అడ్డుకున్నారు పోలీసులు. ఈ నిరసనను ఆపివేసేందుకు రంగంలోకి దిగిన వన్ టౌన్ సీఐ అంజు యాదవ్ ఓ కార్యకర్తపై చేయి చేసుకుంది.