తానా కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన కృష్ణా జిల్లాకు చెందిన వర్జీనియా ప్రవాసాంధ్రుడు డా.కొడాలి నరేన్ అభినందన కార్యక్రమం తానా మాజీ అధ్యక్షుడు వేమన సతీష్ ఇంటి వద్ద నిర్వహించారు. సతీష్ మాట్లాడుతూ విద్యావేత్త, సౌమ్యుడైన నరేన్ కార్యదక్షతతో తానా ఖ్యాతిని ఇనుమడింపచేస్తారని ఆశాభావాన్ని వ్యక్తపరిచారు. రెండు దశాబ్దాల తమ స్నేహబంధాన్ని గుర్తు చేసుకున్నారు. గుంటూరు జడ్పీ మాజీ చైర్మన్ పాతూరి నాగభూషణం మాట్లాడుతూ తానా ఉన్నంత వరకూ తెలుగుభాష అస్తిత్వం అమెరికాలో ఉంటుందన్నారు. రామ్ చౌదరి ఉప్పుటూరి తానా సేవా పరిధిని విస్తృతపరచాలని కోరారు. అనంతరం బాణాసంచా కాల్చారు. నరేన్ కృతజ్ఞతలు తెలిపారు. సత్య సూరపనేని, మన్నే సత్యనారాయణ, కృష్ణ లామ్, సుధీర్ కొమ్మి, భాను మాగులూరి, కార్తిక్ కోమటి, రవి అడుసుమిల్లి, సాయి బొల్లినేని, అనిల్ ఉప్పలపాటి, సతీష్ చింతా, యువ సిద్దార్థ్ బోయపాటి తదితరులు పాల్గొన్నారు.