Devotional

శివాలయంలో కొట్టిన కొబ్బరికాయను ఇంటికి తీసుకురాకూడదా?

శివాలయంలో కొట్టిన కొబ్బరికాయను ఇంటికి తీసుకురాకూడదా?

ఎక్కువ మంది చెప్తూ ఉంటారు శివాలయంలో కొబ్బరికాయని కొట్టిన తర్వాత ఆ కొబ్బరికాయని ఇంటికి తెచ్చుకోకూడదని.. నిజంగా అసలు మనం కొబ్బరికాయని శివాలయంలో కొట్టిన తర్వాత ప్రసాదం కింద ఇంటికి తెచ్చుకోకూడదా..? ఈ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం…. దీనిని కనుక మీరు చూశారంటే కచ్చితంగా మనం కొబ్బరికాయను ఇంటికి తెచ్చుకోవచ్చా లేదా అనేది తెలుస్తుంది. దీని వెనక ఒక పెద్ద కథ ఉంది అదేంటంటే… ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు అతను వేదాలని చదువుకున్నాడు. ఒకరోజు ఎవరో ఆవులని కొట్టడానికి చూసి ఆ పిల్లవాడు తానే ఆవులని రక్షిస్తానని చెప్తాడు. రోజు తను వేదాలను చదువుకుంటూ ఆవులని కాపాడుతూ ఉండేవాడు.రుద్రం చదువుతూ ఉండేవాడు. రుద్రం చదవడం చాలా గొప్పది రుద్రం చదువుతూ ఒకరోజు ఇసుకతో శివలింగాన్ని కట్టి పాలని తీసి అభిషేకం చేస్తాడు. మనసంతా కూడా ఈశ్వరుడు మీద పెడతాడు. అయితే ఇసుకకి పాలు పోస్తున్నాడని తన తండ్రి వచ్చి ఇసుకతో చేసిన శివలింగాన్ని కాలితో తన్నుతాడు. అప్పుడు వెంటనే ఎవరనేది కూడా చూడకుండా ఆ పిల్లవాడు తన తండ్రి రెండు కాళ్ళని తొడ వరకు నరికేస్తాడు. దీంతో తండ్రి చనిపోతాడు.

ఇసుకలో కట్టిన శివ లింగం నుండి పార్వతీ పరమేశ్వరులు వస్తారు. ఇకనుండి నువ్వు కూడా మా కుటుంబంలో ఒకడివి అని చెప్తారు. నిన్ను చండీశ్వరుడు అని అంటారని పార్వతీ పరమేశ్వర్లు అతనితో చెప్తారు. అంతేకాకుండా శివుడు నేను తిని విడిచిపెట్టిన భోజనాన్ని చండేశ్వరుడు తింటాడు అని చెప్తారు. అందుకే కొబ్బరికాయని కొట్టి చండీశ్వరుడు కోసం వదిలేయాలని అంటారు కానీ చండీశ్వరుడికి ఆలయంలో కొబ్బరికాయను చూపించి, ఇంటికి తెచ్చుకోవచ్చు. పూర్ణాధికారం అప్పుడు వస్తుంది.