మనం మరచి పోతున్న కొన్ని సనాతన సాంప్రదాయాలు… తెలుసుకోండి… ఆచరించండి.
- సోమవారం తలకు నూనె రాయరాదు.
- ఒంటి కాలిపై నిలబడ రాదు.
- మంగళ వారం పుట్టినింటి నుండి కూతురు అత్తారింటికి వెళ్లరాదు.
- శుక్రవారం నాడు కోడలిని పుట్టినింటికి పంపరాదు.
- గుమ్మడికాయ ముక్కలనే ఇంటికి తేవాలి.
- ఇంటిలోపల గోళ్ళు కత్తిరించరాదు.
- మధ్యాహ్నం తులసి ఆకులు కోయరాదు.
- సూర్యాస్తమయం తరువాత కసవు వూడ్చరాదు, తల దువ్వరాదు.
- పెరుగును, ఉప్పును అప్పు ఈయరాదు.
- వేడి వేడి అన్నంలో పెరుగు వేసుకోరాదు.
- భోజనం మధ్యలో లేచిపోరాదు.
- తల వెంట్రుకలు ఇంట్లో వేయరాదు.
- గడపపై పాదం పెట్టి వెళ్లరాదు.
- ఇంటినుండి బయటకు వెళ్ళేటప్పుడు కసవూడ్చరాదు
- గోడలకు పాదం ఆనించి పడుకోరాదు.
- రాత్రి వేళలో బట్టలు ఉతకరాదు. విరిగిన గాజులు వేసుకోరాదు.
- నిద్ర లేచిన తరువాత పడుకున్న చాపను మడిచి పెట్టాలి.
- చేతి గోళ్ళను కొరకరాదు.
- అన్న తమ్ముడు, తండ్రి కొడుకు ఒకే సారి క్షవరం చేయించు కోరాదు.
- ఒంటి (సింగిల్) అరిటాకును తేరాదు.
- సూర్యాస్తమయం వేళలో నిద్ర పోరాదు.
- కాళ్ళు కడిగేటప్పుడు మడమలను మరచిపోరాదు.
- ఇంటి గడపపై కూర్చోరాదు.
- తిన్న తక్షణమే పడుకోరాదు.
- పెద్దల సమక్షంలో కాలుపై కాలు వేసుకుని / కాళ్ళు చాపుకుని కూర్చోరాదు.
- చేతులు కడిగిన పిమ్మట విదిలించరాదు.
- రాత్రి భోజనం తరువాత పళ్ళెం కడుక్కోవాలి.
- ఎంగిలి చేతితో వడ్డించరాదు.
- అన్నం, కూర, చారు వండిన పాత్రలలో తినరాదు.
- సింకులో పాత్రలపై ఎంగిలి చేతులు కడగరాదు.
- ఇంటికి వచ్చిన ఆడ పిల్లలకు, ముత్తైదువులకు పసుపు కుంకుమ ఇవ్వకుండా పంపరాదు.
- చిరిగిన అంగీలు, బనియన్లు తదితర లో దుస్తులను ధరించరాదు.
- ఇంటి లోపలికి చెప్పులు/ Shoes ధరించిరారాదు.
- దేవాలయాలలో చెప్పులు పోతే మరచిపొండి. వేరే వాళ్ళవి వేసుకొస్తే దారిన పోయే దరిద్రాన్ని ఇంటికి తెచ్చుకున్నట్లే.
- జంతువులకు (కుక్కలు, దూడలు లాంటివి) పాచిపోయిన పదార్థాలు పెట్టకండి.
- ఒకరు వేసుకున్న బట్టలు, ఆభరణాలు మరొకరు ధరించరాదు.
- శనివారం ఉప్పు, నూనె కొని తేరాదు.
- అనవసరంగా కొత్త చెప్పులను కొనరాదు.
- ఇంటిలో వాడకుండా పడివున్న గోడ గడియారాలు, వాచీలు, సైకిళ్ళ, కుట్టు మెషిన్లు లాంటివి వదిలించుకోవాలి.
- భగవంతుణ్ణి అది కావాలి, ఇది కావాలి అని అడుక్కుని భిక్షగాళ్ళుకాకండి. మీకు రావలసివుంటే ఆయనే ఇస్తాడు.
- అర్హులకు మాత్రమే గుప్త దానం చేయండి.
- మఠాలు దేవాలయాకు చెందిన వస్తువులు దురుపయోగం చేస్తే మీ తరువాతి తరం వాళ్ళకు శిక్ష పడుతుంది.
- ఇతరులను అనవసరంగా విమర్శించడం, మిమ్మలిని మీరు పొగడుకోవడం మానండి.
- మీరు, మీ అధికారం ఏవీ శాశ్వతం కావు. ఇతరులను ఎదగనివ్వండి. మీరు వారికి గురువులాగా ప్రవర్తించండి.
🗣️ మన పూర్వీకులు చెప్పిన పై వాటిని ఆలోచించి మార్పు సహజమని గుర్తించి ప్రశాంత జీవన విధానం అలవరచుకోండి.
🗣️ కారు మేఘాలు కమ్ముతున్నాయి ఏక్షణంలో అయినా… వర్షం విపరీతంగా కురుస్తుంది…! వేసే ముగ్గు… ఆవర్షంలో కలుస్తుంది ! అయినా… ఆమె ముగ్గువేస్తోంది… !
అదీ… సంప్రదాయం అంటే…!
…………………….
🗣️ వాళ్ళు అంతర్జాతీయ ఖ్యాతినార్జించి అమెరికాలో ఉంటున్న వైద్యుడు. సొంతూరు వచ్చినప్పుడల్లా పాఠాలు చెప్పిన పంతులు గారికి పాదాభివందనం చేస్తాడు…!
అదీ…. సంస్కారం !
…………………
🗣️ ఖగోళ శాస్త్రాన్ని నమిలి మింగిన నిష్ణాతుడు. నిష్టగా ఉంటూ గ్రహణం విడిస్తేగానీ… ఆహారం తీసికోడు…!
అదీ… నమ్మకం !
……………………
🗣️ పరమాణు శాస్త్రాన్ని పిండి పిప్పిచేసిన పండితుడు. మనవడి పుట్టు వెంట్రుకలు పుణ్యక్షేత్రంలో తీయాలని పరదేశం నుండి పయనమై వస్తాడు…!
అదీ… ఆచారం !
………………………
🗣️ అంతరిక్ష విజ్ఞానాన్ని అరచేతబట్టిన అతిరధుడు. అకుంఠిత నిష్ఠతో పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తాడు…!
అదీ…. సనాతన ధర్మం!
……………………..
🗣️ అత్తింటికి వెళ్లేముందు ఇంటి ఆడబడుచు పెద్దలందరికీ పాదాభివందనం చేసి పయనమవుతుంది…!
అదీ… పద్ధతి !
……………………
🗣️ పెద్ద చదువులు చదివినా పెద్ద కొలువు చేస్తున్నా పేరు ప్రఖ్యాతులున్నా పెళ్లి పీటలమీద… వధువు పొందికగా ఉంటుంది…!
అదీ… సంస్కృతి!
………………………….
🗣️ ఘభార్య పక్షవాతానికి లోనయ్యింది. మంచం దిగలేని పరిస్థితి. తనంతట తానుగా నడవలేని స్థితి. భర్త భరోసాగా నిలచి… భారమంతా మోస్తాడు- అన్నీ తానై ఆలిని సాకుతాడు…!
అదీ .. దాంపత్యం!
……………………….
🗣️బ్రతికే అవకాశం తక్కువ వెంటిలేటర్ పై వేచిచూస్తే బ్రతికితే బ్రతకొచ్చు! లక్షల ఖర్చు భరిస్తూ వెంటిలేటర్ పై పెడతారు… !
అదీ…. అనుబంధం!
🗣️ ఇవి భారతీయుల తరతరాల ఆచారాలు, సంప్రదాయలు, విలువల్లో కొన్ని మాత్రమే
🙏 మన హిందూ సాంప్రదాయాలను ఆచరించండి, అందరితో ఆచరింపచేయండి.🙏