DailyDose

45 ఏళ్లలో తొలిసారి మళ్లీ తాజ్‌మహల్‌కు వరద

45 ఏళ్లలో తొలిసారి మళ్లీ తాజ్‌మహల్‌కు వరద

ఢిల్లీలో యమున నది వరద నీరు అతలాకుతలం చేస్తుంది. రెండు రోజుల పాటు కాస్త తగ్గిన నది.. భారీ వర్షాలు కురవడంతో మళ్లీ పెరిగింది. దీంతో యమున నది నీరు ఆగ్రా లోని తాజ్‌మహల్ గోడలను తాకింది. అలాగే మహల్ వెనక ఉన్న తోట మొత్తం వరద నీటితో మునిగిపోయింది. ఈ సందర్భంగా ASI వద్ద కన్జర్వేషన్ అసిస్టెంట్ ప్రిన్స్ వాజ్‌పేయి మాట్లాడుతూ.. 1978లో అధిక వరదల సమయంలో యమునా నది తాజ్ మహల్ వెనుక గోడను చివరిసారి తాకింది. మళ్లీ నేడు భారీ వర్షాల కారణంగా యమున వరద నీరు తాజ్ మహల్ గోడలను తాకాయని.. 45 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఇలా జరిగిందని ఆయన తెలిపారు. కాగా మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో ఢిల్లీలో వరదలు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు.