ఇంచుమించుగా టీ అలవాటు అందరికీ ఉంటుంది చాలా మంది ప్రతి రోజూ టీ తాగుతూ ఉంటారు. ఉదయం మధ్యాహ్నం కూడా చాలా మంది టీ తాగుతారు. మీరు కూడా టీ తాగుతున్నారా..? అయితే కచ్చితంగా మీరు ఈ విషయాలను తెలుసుకోవాలి టీ తో పాటుగా చాలా మంది బిస్కెట్స్ ని తింటూ ఉంటారు చాలా మందికి టీ తో బిస్కెట్ తీసుకోవడం అంటే ఇష్టం ఈ కాంబినేషన్ నచ్చుతుంది. కానీ ఆరోగ్య నిపుణులు ఇలా తీసుకోవడం మంచిది కాదని అంటున్నారు.టీతో పాటుగా బిస్కెట్లు ని తీసుకోవడం వలన వివిధ రకాల వ్యాధులకు స్వాగతం పలికినట్లే అని అంటున్నారు. టీ తో బిస్కెట్ తీసుకుంటే డిఎన్ఏ కి కూడా ఇబ్బంది కలుగుతుంది టీతో బిస్కెట్స్ ని తీసుకుంటే బీపీ బాగా పెరుగుతుంది. హైపర్ టెన్షన్ సమస్య వచ్చే ముప్పు బాగా పెరుగుతుంది అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. టీ తో పాటు బిస్కెట్స్ ని తీసుకోవడం వలన గుండెపోటు ప్రమాదం కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
అలానే బిస్కెట్స్ లో షుగర్ వాడుతుంటారు టీ లో కూడా పంచదార ఉంటుంది. ఈ రెండిటి వల్ల షుగర్ స్థాయిలు పెరిగిపోతాయి. ఇన్సులిన్ హార్మోన్స్ ఇన్ బాలన్స్ అవడం వలన డయాబెటిస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కాంబినేషన్ ని ట్రై చేయకండి డయాబెటిస్ వచ్చే రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. మలబద్ధకం వంటి ఇబ్బందులు కూడా వస్తాయి. రోజు మీరు టీ తో పాటు బిస్కెట్స్ ని తీసుకుంటే కచ్చితంగా ఈ అలవాటుని మానుకోండి మీరు కావాలంటే బిస్కెట్స్ కి బదులుగా వేయించిన శనగలు వంటివి తీసుకోవచ్చు.