Movies

ప్రాజెక్ట్-K ఫస్ట్ గ్లింప్స్

ప్రాజెక్ట్-K ఫస్ట్ గ్లింప్స్

హీరో ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్.. మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్​లో తెరకెక్కుతున్న సినిమా ప్రాజెక్ట్ కె. దీపికా పదుకొణె హీరోయిన్​గా.. అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఈ మూవీ రెండు పార్టులుగా తెరకెక్కనున్నట్లు ఓ వార్త బాగా వైరల్ అవుతోంది. ప్రాజెక్టు కె సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించే దిశగా చిత్రబృందం ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా, తాజాగా ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ వదిలింది చిత్ర బృందం. ఈ సినిమాకు కల్కి 2898 AD అని టైటిల్ నువ్వు ఫిక్స్ చేసింది చిత్రం బృందం. ఈ మెరుపు సినిమా ఫస్ట్ గ్లిoమ్స్ రిలీజ్ చేసింది. ఇక ఈ వీడియోలో సినిమా మొత్తం హాలీవుడ్ రేంజ్ లో మనకు కనిపిస్తోంది. ప్రభాస్ కూడా చాలా పవర్ఫుల్ హీరోగా ఇందులో కనిపించాడు.