Politics

ఇవ్వాళా శ్రీలంక అధ్యక్షుడు ప్రధాని మోదీతో భేటీ

ఇవ్వాళా  శ్రీలంక అధ్యక్షుడు ప్రధాని మోదీతో భేటీ

శ్రీలంక అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘె రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా గురువారం సాయంత్రం దిల్లీకి చేరుకున్నారు. ఆయనకు విమానాశ్రయంలో విదేశాంగశాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్‌ స్వాగతం పలికారు. శుక్రవారం విక్రమసింఘె ప్రధాని మోదీతో భేటీ అవుతారు. వారిద్దరి మధ్య ఆర్థిక, వాణిజ్య అంశాలపై చర్చలు జరుగుతాయని విదేశాంగశాఖ వెల్లడించింది. తాను భారత్‌కు వచ్చేముందు కీలక మంత్రిత్వశాఖ బాధ్యతలను తాత్కాలికంగా ఐదుగురు మంత్రులకు విక్రమసింఘె అప్పగించారు.