ఇప్పుడే ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలోని నేతన్నలు అందరికీ బటన్ నొక్కి ఒక్కొక్కరికి నేతన్న నేస్తం అన్న పధకం క్రింద రూ. 24 వేలు చొప్పున అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశారు. వెంకటగిరి నియోజకవర్గం ప్రజలతో మాట్లాడుతున్న సీఎం జగన్ ప్రజల కోసం వైసీపీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పధకాలు గురించి వివరించారు. ఈయన మాట్లాడుతూ ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయని విధంగా వైసీపీ ప్రజలకు ఉపయోగపడే అనేక పధకాలను మీకు తీసుకువచ్చింది అన్నారు. రాష్ట్రంలోని అక్క చెల్లమ్మలకు 30 లక్షల ఇల్లు ఇచ్చాము, అంతే కాకుండా ఇప్పటి వరకు డి బి టి ద్వారా రూ. 2 .25 లక్షల కోట్లు అందించిన చరిత్ర మా ప్రభుత్వానిది అంటూ గర్వంగా చెప్పుకున్నారు. 2 లక్షల 6 వేల ప్రభుత్వ ఉద్యోగాలను కూడా ప్రజలకు అందించాము అంటూ జగన్ చెప్పుకొచ్చారు.మేము ఎన్నికల ముందు చెప్పిన హామీలలో 98 శాతం ఇప్పటికే నెరవేర్చమని ప్రజలతో చెప్పారు. మన రాష్ట్రాన్ని చూసి దేశంలోని మిగిలిన రాష్ట్రాలు నేర్చుకునేలా మన పాలన సాగుతోందన్నారు.