Business

బ్యాంక్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌

బ్యాంక్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌

సాధారణంగా ప్రతి కార్యాలయానికి వారానికి ఆరు రోజుల పని దినాలు ఉంటాయి. ఆదివారం సెలవు ఉంటుంది. కానీ సాఫ్ట్వేర్ రంగంలో మాత్రం ఐదు రోజులు మాత్రమే విధులు నిర్వహిస్తారు. శనివారం ఆదివారం సెలవులను ఇస్తుంటారు. ఇదే విధానాన్ని ఇప్పుడు బ్యాంకులో కూడా అమలు చేయాలని ఉద్యోగులు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. రోజువారి విధుల్లో ఒత్తిడి తీవ్రమవుతున్నందున వారానికి రెండు రోజులు సెలవు ఇవ్వాలని బ్యాంక్ ఉద్యోగుల అసోసియేషన్ ఎప్పటినుంచో కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతోంది. అలాగే జీతాల పెంపు తదితర డిమాండ్ల పరిష్కార ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచింది.

ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ ప్రతిపాదనకు కేంద్రం స్పందించింది. జూలై 28న బ్యాంక్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.ఈ సమావేశంలో బ్యాంకులకు ప్రతివారం రెండు రోజులు సెలవు ఉండేలా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వినిపిస్తుంది.

ఇప్పటివరకు బ్యాంకులకు ఆరు రోజుల పని దినాలు ఉన్నాయి‌‌. రెండు, నాలుగో శనివారం సెలవు దినాలుగా ఏర్పాటు చేశారు. అయితే మరో రెండు శనివారాలు కూడా సెలవులు ఇవ్వాలని బ్యాంకు ప్రతినిధులు కోరుతున్నారు. రోజువారి పనిగంటల్లో ఒత్తిడి మేరకు ఉద్యోగులు ఆరోగ్యం దెబ్బతింటుందని, అందువల్ల వారానికి ఐదు రోజులు మాత్రమే పని దినాలు ఉంచాలని కోరుతున్నారు. ఈ మేరకు బ్యాంక్ అసోసియేషన్ ప్రతినిధులు గతంలోనే కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

అయితే రోజువారి పని గంటల్లో పెంపునకు ఓకే అయితేనే వారానికి రెండు రోజుల సెలవులు అనుమతిస్తామని కేంద్ర ప్రభుత్వం నుంచి ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బ్యాంకులు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తున్నాయి. వారానికి రెండు రోజులు సెలవులు కేటాయిస్తే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేసేలా సమయం మార్చుకోవాలని, అలాగైతేనే వారానికి రెండు రోజుల సెలవులకు ఆమోదం తెలిపే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు జూలై 28న బ్రాంచ్ అసోసియేషన్ ప్రతినిధులతో నిర్వహించే సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఎల్ఐసి విభాగంలో వారానికి ఐదు రోజుల పని దినాలను కేటాయించారు. ఇప్పుడు తమకు కూడా ఇదే విధానాన్ని అమలు చేయాలని బ్యాంక్ అధికారులు కోరుతున్నారు. అయితే 28న జరిగే సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకుంటుందని బ్యాంక్ ఉద్యోగుల తో పాటు వినియోగదారులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.