DailyDose

తెలంగాణ, మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిచిపోయాయి

తెలంగాణ, మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిచిపోయాయి

మహారాష్ట్రలో కురుస్తోన్న భారీ వర్షాల నేపథ్యంలో పెన్ గంగ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్ మండలం డొలరా వద్ద పెన్ గంగ నది ఉగ్ర రూపం దాల్చింది. 50 అడుగుల ఎత్తు ఉన్న వంతెనను తాకుతూ పెన్ గంగా ప్రవహిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెన్ గంగ విజృంభించడంతో నేషనల్ హైవే 44పై వాహనాలు ఎక్కడికక్కడే స్తంభించాయి. పెన్ గంగ నది వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో అప్రమత్తమైన అధికారులు.. ముందుగానే మహారాష్ట్ర- తెలంగాణ రాష్ట్రాల మధ్య ఈ రూట్‌లో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. వరద ఉధృతి తగ్గిన తర్వాత తిరిగి వాహనాల రాకపోకల పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు. ప్రయాణికులు, వాహనదారులు అలర్ట్‌గా ఉండాలని అధికారులు హెచ్చరించారు.