చిత్తూరు జిల్లా కుప్పంలో తెదేపా అధినేత చంద్రబాబు చేపట్టనున్న సొంతింటి నిర్మాణానికి ఎట్టకేలకు అడ్డంకులు తొలగిపోయాయి. కుప్పానికి ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబు.. అక్కడ సొంత ఇంటి నిర్మాణం కోసం ఏడాదిన్నర క్రితం స్థలం కొని, ప్రహరీ పనులు చేపట్టారు. ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం నుంచి అనుమతులు రావడంలో జాప్యం కొనసాగింది. ఎట్టకేలకు పీఎంకే ఉడా నుంచి మూడు రోజుల క్రితం అనుమతులు లభించాయి. శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీ శివపురం వద్ద.. కుప్పం- పలమనేరు జాతీయరహదారి పక్కన రెండు ఎకరాల స్థలంలో ఇంటి నిర్మాణ పనులను పూజలతో ఆదివారం ప్రారంభించారు. నియోజకవర్గ తెదేపా సమన్వయ కమిటీ కన్వీనర్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, నియోజకవర్గ ఇన్ఛార్జి మునిరత్నం, చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్, చంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ ఏడాది ఆఖరు లోపు ఇంటి నిర్మాణం పూర్తిచేయాలని భావిస్తున్నట్లు నాయకులు పేర్కొన్నారు.
Kuppam: చంద్రబాబు సొంత ఇంటికి భూమిపూజ
Related tags :