DailyDose

మణిపూర్ మహిళల నగ్న ఊరేగింపుపై స్పందించిన అమెరికా

మణిపూర్ మహిళల నగ్న ఊరేగింపుపై స్పందించిన అమెరికా

రెండు జాతుల మధ్య వైరంతో గత రెండున్నర నెలలుగా మణిపూర్‌ అట్టుడుకుతోంది. ఇటీవల ఇద్దరు మహిళలను కొందరు వ్యక్తులు నగ్నంగా ఊరేగిస్తున్న ఘటన యావత్‌ దేశాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేసింది. మే 4న చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో.. జూలై 19న సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమయింది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై దేశ వ్యాప్తంగా విమర్శలు చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఇదిలా ఉండగా.. తాజాగా ఈ ఘటనపై అగ్రదేశమైన అమెరికా స్పందించింది. దీనిని క్రూరమైన, భయంకరమైన ఘటనగా అభివర్ణించారు. బాధితులకు యూఎస్ ప్రభుత్వం సానుభూతిని ప్రకటించింది. మానవ హక్కులను కాపాడాలని స్థానిక ప్రభుత్వాన్ని కోరింది. కాగా, ఈ ఘటనకు సంబంధించి ఓ మైనర్ సహా ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ అంశంపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోడీ నిందితులను ఎట్టిపరిస్థితుల్లో వదిలేదని అని స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయ్యారు.