Movies

వాటర్‌ క్యాన్‌తో సంగీతం అందించిన డీఎస్‌పీ

వాటర్‌ క్యాన్‌తో సంగీతం అందించిన డీఎస్‌పీ

రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు అద్భుతమైన మ్యూజిక్ అందించారు.. అదిరిపోయే బీజీఎంలతో మ్యూజిక్ లవర్స్ ని బాగా ఆకట్టుకున్నారు. తన సినిమా కేరీర్ లో దాదాపు వందకుపైగా సినిమాలకు అద్భుతమైన సంగీతం అందించాడు.ఇప్పటికీ బడా ప్రాజెక్ట్స్ కు మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు దేవిశ్రీ..సినిమాలతో పాటు మ్యూజిక్ ఈవెంట్స్ తో కూడా అదరగొడుతున్నాడు ఇటీవల విదేశాల్లో ఎక్కువగా పెర్ఫామెన్స్ చేస్తూ కనిపిస్తున్నారు. జూలై 2న డల్లాస్ మరియు జూలై 15న సీటెల్ లో పెర్ఫామ్ చేసి బాగా ఆకట్టుకున్నారు.నిన్న అమెరికా లోని శాన్ జోస్ లో తన మ్యూజిక్ తో ఆడియెన్స్ ను బాగా అలరించారు. ఈవెంట్ లో సింగర్స్ సాగర్, రీటా, పృధ్వీ, ఇంద్రావతి చౌహాన్, హేమచంద్ర మరియు మంగ్లీ వంటి ప్రముఖ గాయకులు పాల్గొన్నారు. టూర్ హోస్ట్ గా అనుసయ భరద్వాజ్ కూడా పాల్గొన్నారు.దేవిశ్రీ తనదైన శైలిలో పెర్ఫామెన్స్ ఇచ్చి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు..అయితే ఈ ఈవెంట్ కు ముందు దేవీశ్రీ ప్రసాద్ వదిలిన ఓ వీడియో నెట్టింట బాగా వైరల్ గా మారింది.

భారీ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ తో సంగీతం అందించడం అందరూ చూస్తూనే వుంటారు.. కానీ మనం సాధారణంగా ఇంటి పనుల కోసం వాడే వస్తువులతోనూ దేవీశ్రీ మ్యూజిక్ సృష్టిస్తున్నారు.. అప్పట్లో జాతరలో దొరికే చిన్న పీకలాంటి ఇన్ స్ట్రుమెంట్ తో ‘వాల్తేరు వీరయ్య’లోని పూనకాలు లోడింగ్ పాటలో అదిరిపోయే మ్యూజిక్ అందించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా వాటర్ కేన్ తో మోతమోగించి అందరిని ఆకట్టుకున్నారు. తనలోని టాలెంట్ ను కొత్తగా ప్రదర్శించి బాగా ఆకట్టుకుంటున్నారు దేవిశ్రీ..ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట బాగా వైరల్ గా మారింది.ప్రస్తుతం దేవిశ్రీపుష్ప 2 సినిమా కి అదిరిపోయే మ్యూజిక్ అందించే పనిలో వున్నారు.అలాగే తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ‘కంగువా’కూ మరియు పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకు కూడా దేవిశ్రీ మ్యూజిక్ అందిస్తున్నారు.