కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సంచలన ఆరోపణలు చేశారు. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ, జేడీఎస్‌లు కలిసి కుట్ర పన్నాయని ఆయన ఆరోపించారు. బీజేపీ, జేడీఎస్ నేతలు పొత్తు కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని, ఈ కుట్రకు బెంగుళూరు, ఢిల్లీలో కాకుండా సింగపూర్ లో చర్చలు జరుగుతున్నట్లుగా తన వద్ద సమాచారం ఉందన్నారు. అయితే శివకుమార్ కామెంట్స్ ను జేడీ-ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రహీం ఖండించారు.
బీజేపీ, తమ పార్టీ మధ్య పొత్తు వల్ల 85 సీట్లు మాత్రమే వస్తాయని ఇంకా 50 సీట్లు కావాలని చెప్పారు. దీని గురించి ఎందుకు పట్టించుకుంటారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు తమకు అలాంటి ఆలోచనలు లేవన్నారు. శివకుమార్ కామెంట్స్ ను కర్ణాటక రెవెన్యూ మంత్రి కృష్ణ బైరేగౌడ సమర్థించారు, ఎన్నికైన ప్రభుత్వాలను పడగొట్టడంలో బీజేపీకి మంచి ఖ్యాతి ఉందని అన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని కర్ణాటక మంత్రి ఆరోపించారు. ఈ క్రమంలో తాము అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.