Food

టిఫిన్, టీ ధరలు పెరగనున్నాయి

టిఫిన్, టీ ధరలు పెరగనున్నాయి

గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు వీడకుండా కురుస్తున్నాయి.. కొన్ని రాష్ట్రాల్లో భారీగా వరదలు పొంగి పొర్లుతున్నాయి.. మరోవైపు నిత్యావసర వస్తువులు కూడా భారీగా పెరుగుతున్నాయి.. సామాన్యుడుకు కడుపునిండా నాలుగు వేళ్ళు నోటి దగ్గరకు వెళ్లడం లేదని తెలుస్తుంది.. హోటల్స్, రెస్టారెంట్ లలో కొన్ని కూరలను ఎత్తివేశారు.. అయితే ఇప్పుడు మరో న్యూస్ వైరల్ అవుతుంది.. పెరిగిన కూరగాయల ధరలను దృష్టిలో ఉంచుకొని వచ్చే నెల నుంచి టిఫిన్ ధరలు, టీ, కాఫీల ధరలు భారీగా పెరగనున్నాయని తెలుస్తుంది..

నిత్యావసర వస్తువుల ధరలు అకాశాన్నంటడంతో టిఫిన్ ధరలను 10 శాతం మేరకు పెంచాలని బృహత్‌ బెంగళూరు హోటళ్ల సంఘం నిర్ణయించింది.. సంఘం గౌరవ కార్యదర్శి వీరేంద్ర కామత్‌ ఈ మేరకు నగరంలో సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే బియ్యం, కూరగాయల ధరలు బాగా పెరిగాయని, వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్‌ ధరల అధికంగా ఉన్నాయని ఆ ప్రకటనలో తెలిపారు.. ఇక వచ్చే నెల ఒకటి నుంచి పాలు లీటర్ పై రూ.3 రూపాయలు భారీగా పెరగను నున్నట్లు తెలుస్తుంది.అదే విధంగా కాఫీ పొడి ధర పెరిగింది. ఆగస్టు 1 నుంచి పాల ధరలు పెరగనున్నాయి. ఇలా కాఫీ, టీల ధర 2 నుంచి 3 రూపాయల వరకు పెరుగుతుంది. స్నాక్స్ రూ.5. ఇక మధ్యాహ్న భోజనానికి రూ.10 పెరగనుంది. రేపు, మంగళవారాల్లో జరిగే అసోసియేషన్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని సంఘం కార్యదర్శి వీరేంద్ర కామత్ తెలిపారు. ఇప్పటికే కొన్ని హోటళ్లలో ధరలు పెంచారు. అధికారికంగా ఆగస్టు 1 నుంచి రేట్ల పెంపు ఉంటుందని సంఘం అధ్యక్షుడు పీసీ రావు తెలిపారు… అంటే మొత్తానికి జనాలకు వచ్చే నెలలో భారీ షాక్ తగలనున్నాయని తెలుస్తుంది.. ఇంక ఏం పెరుగుతాయో చూడాలి..