Videos

Judgemental Hai Kya Trailer

Judgemental Hai Kya Trailer

బాలీవుడ్‌ స్టార్స్‌ కంగనా రనౌత్‌, రాజ్‌కుమార్‌ రావు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జడ్జిమెంటల్‌ హై క్యా’. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాశ్‌ కోవెలమూడి సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ చిత్ర ట్రైలర్‌ విడుదలైంది. ఓ మర్డర్‌ కేసులో పోలీసులు బాబీ (కంగన), కేశవ్‌ (రాజ్‌కుమార్‌) ప్రధాన నిందితులుగా భావించి అరెస్ట్‌ చేస్తారు. అయితే వీరిద్దరూ ఒక్కోసారి ఒక్కోలా ప్రవర్తిస్తుంటారు. కంగన మానసిక రోగిలా నటించడం.. ఓ బొద్దింక న్యాయం కావాలని కోరుకుంటోందని పోలీసులతో చెప్పే సంభాషణ నవ్వులు పూయిస్తోంది. జులై 26న సినిమాను ప్రేక్షకలు ముందుకు తీసుకురానున్నారు.