డొనాల్డ్ ట్రంప్ ఈ పేరు వార్తల్లో హాట్ టాపిక్.. ఆయన హయాంలో అగ్రరాజ్యం నిత్యం వార్తల్లో ఉండేది. ఆయన అగ్రరాజ్యానికి మాజీ అధ్యక్షుమైన తరువాత కూడా చాలాకాలం మీడియాల్లో వినిపించింది. తనను మర్చిపోతున్నారని అనుకున్నారా ఏమో తెలియదు కాని ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ క్రికెట్ బ్యాట్ పట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్ట్రీట్ క్రికెట్ గేమ్‌లో తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నట్లు ఓ వీడియో ఉంది. ఈ వీడియోలో ట్రంప్ షాట్ కొట్టడంతో అక్కడున్న వారు షాట్‌కి పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో… తక్కువ సమయంలోనే 1.1 మిలియన్ల వీక్షణలు .. 6 వేల కంటే ఎక్కువ లైక్‌లను పొందింది. ట్రంప్ , కిమ్‌ల రాజకీయ విభేదాలను ప్రస్తావిస్తూ ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ చప్పట్లు కొడుతున్న ఫోటోను ఒక వినియోగదారు వినోదభరితంగా పోస్ట్ చేశారు. మెక్సికోపై గతంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ట్రంప్ ఇప్పుడు క్రికెట్ బంతిని తిరిగి ఇవ్వమని మెక్సికన్లను అడగాలని మరొకరు చమత్కరించారు. చాలా మంది ఏకగ్రీవంగా ఈ షాట్‌ను క్రికెట్ చరిత్రలో గొప్ప షాట్‌గా ప్రకటించారు. డొనాల్డ్ ట్రంప్ పేరు తరచుగా సోషల్ మీడియాలో విచిత్రంగాయాదృచ్ఛిక పోలికలతో చాలా ఫన్నీగా కనిపిస్తుంది. గతంలో, ఫ్లోరిడా వినియోగదారుడు ట్రంప్‌తో అద్భుతమైన పోలికను కలిగి ఉన్న నారింజ రంగు మేఘాన్ని ఫోటో తీశాడు, ఇది వినోదభరితమైన పోలికలను ప్రేరేపించింది.