ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో ఒహాయో వ్యాలీ టి7 క్రికెట్ టోర్నమెంట్ మరియు టి5 ఉమెన్స్ క్రికెట్ టోర్నమెంట్ ను ఆగస్టు 5వ తేదీన నిర్వహిస్తున్నామని తానా క్రీడా విభాగ సమన్వయకర్త పంచుమర్తి నాగ తెలిపారు. కొలంబస్లో జరిగే ఈ పోటీలు ఉదయం 7.30 నుంచి ప్రారంభమవుతాయి. తానా అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు, తానా ఫౌండేషన్ ట్రస్టీ రవి సామినేని, తానా ఒహాయో వ్యాలీ రీజినల్ రిప్రజెంటేటివ్ శివ చావా ఈ పోటీల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. విజేతలకు బహుమతులు అందజేస్తారు. వేణు చావా, వంశీ మద్దులూరి, సిద్దార్థ రేవూర్, శ్రీకాంత్ మునగాల ఈ పోటీల విజయవంతానికి కృషి చేస్తున్నారు.