Devotional

శ్రావణమాసంలో శ్రీశైలంలో ఆర్జిత అభిషేకాలు రద్దు

శ్రావణమాసంలో శ్రీశైలంలో ఆర్జిత అభిషేకాలు  రద్దు

ఆగస్టు 17 నుంచి సెప్టెంబరు 15 వరకు నిజ శ్రావణమాసం (Shravanamasam ) సందర్భంగా శ్రీశైలం దేవస్థానంలో ఆర్జిత, సామూహిక అభిషేకాలను నిర్దేశిత తేదీల్లో నిలుపుదల చేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ( EO ) వెల్లడించారు. అధిక శ్రావణంలోనూ అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చే అవకాశముందని అన్నారు. భారీ వర్షాల కారణంగా వచ్చే వరద నీటిని దిగువ ప్రాంతాలకు పంపేందుకు ఆగస్టులో శ్రీశైలం ఆనకట్ట (Srisailam Gates) గేట్లను తెరిచే అవకాశం ఉండడంతో సేవల నిలుపుదల నిర్ణయాన్ని తీసుకున్నామని అన్నారు.ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్‌ 15 వరకు వచ్చే శని, ఆది, సోమవారాలతో పాటు , స్వాతంత్య్ర దినోత్సవం, వరలక్ష్మివ్రతం, శ్రీకృష్ణాష్టమి రోజున అభిషేకాలు, సామూహిక అభిషేకాలను నిలుపుదల చేసినట్లు వివరించారు. ఈ రోజుల్లో మూడు విడతల వారిగా భక్తులకు అలంకార దర్శనం (Alankara Darsan) , స్పర్శ (Sparsha Darsan) దర్శనం కల్పిస్తున్నామని వెల్లడించారు.

శ్రీ స్వామివారి స్పర్శదర్శనం టికెట్లను ఆన్‌లైన్‌ ద్వారా పొందవలసి ఉంటుందని అన్నారు. ఇప్పటికే ఆగస్టు మాసపు టికెట్ల కోటాను ఇప్పటికే దేవస్థానం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు . సెప్టెంబర్ మాసపు టికెట్ల కోటాను ఆగస్టు 25 వ తేదీ నుంచి అందుబాటులో ఉంటుందని వివరించారు. నిర్ధిష్ట రోజుల్లో కాకుండా మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి ఉచిత స్పర్శదర్శనం యథావిధిగా కొనసాగుతుందన్నారు.