శ్రీ కృష్ణుడు పాండవులకు-కౌరవులకు సంధి చేసే నిమిత్తం పాండవ రాయబారిగా హస్తినకు వెళ్లడానికి ముందు పాండవుల కుటుంబముతో అంతరంగ సమావేశ ఘట్టము.
ఈ నాటకానికి కళారత్న గుమ్మడి గోపాలకృష్ణ దర్శకత్వం వహించారు. అమెరికాలో పుట్టి పెరిగిన సిలికానాంధ్ర-మనబడి వర్జీనియా శాఖకు చెందిన పిల్లలు తెలుగు మాట, పాట, పద్యముతో నాటాకాన్ని రక్తికట్టించారు. 2023తానా మహాసభల్లో ప్రదర్శించిన ఈ నాటకం అతిథులను అలరించింది.
కృష్ణుడిగా సాయి శరణ్య భాగవతుల, ధర్మరాజుగా శ్రీకర్ కొవ్వాలి, భీముడిగా ఆదర్శ్ మెహెర్ ముండ్రాతి, ద్రౌపదిగా లాస్య భాగవతుల, అర్జునుడిగా వేద్ జూపల్లి, నకులుడిగా వైష్ణవి పరిమి, సహదేవుడిగా శ్రీహిత వెజ్జు వెంకట ప్రతిభ చాటారు. డా.మూల్పూరి వెంకట్రావు కార్యక్రమానికి ప్రోత్సహం అందించారు. వర్జీనియాలోని చాంట్లి మనబడి సమన్వయకర్త రాజ్ కొవ్వాలి, సిలికానాంధ్ర వ్యవస్థాపకుడు ఆనంద్ కూచిభొట్ల, కులపతి రాజు చమర్తిలు పర్యవేక్షించారు.