DailyDose

స్నేహితుడిని చంపి ఇంట్లోనే పాతిపెట్టిన ఘనుడు-TNI నేటి నేర వార్తలు

స్నేహితుడిని చంపి ఇంట్లోనే పాతిపెట్టిన ఘనుడు-TNI నేటి నేర వార్తలు

*  కంటైనర్‌ ట్రక్కును ఢీకొన్న కారు

తమిళనాడులోని మధురై జిల్లాలోలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కంటైనర్ ట్రక్కును కారు ఢీకొన్న ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మరణించారు. మధురై జిల్లా తిరుమంగళం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద విషయాన్ని మదురై జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) శివ ప్రసాద్ ధ్రువీకరించారు. అయితే ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ఇదిలాఉంటే, మదురైలోని మస్తాన్‌పట్టి టోల్ ప్లాజాలో ఆదివారం తెల్లవారుజామున ఒక విషాద సంఘటన చోటుచేసుకుంది. రాంగ్ రూట్‌లో వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో టోల్ ప్లాజాలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి మరణించాడు. మృతుడు సతీష్ కుమార్‌గా గుర్తించారు. అతడు మదురై జిల్లాలోని సఖిమంగళంకు చెందిన వ్యక్తి. అయితే  బ్రేకు ఫెయిల్ కావడంతో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. టోల్ బూత్ వద్ద సతీష్ కుమార్ లారీని ఆపడానికి ప్రయత్నించగా.. అది అతనిని ఢీకొట్టి కొన్ని మీటర్ల ఈడ్చుకుంటూ వెళ్లింది. దీంతో సతీష్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఇక, ఈ ఘటన తర్వాత లారీ డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయినట్టుగా సమాచారం. 

కదులుతున్న రైల్లో కానిస్టేబుల్ కాల్పులు

కదులుతున్న రైలులో రైల్వే గార్డు కాల్పులు జరిపి కలకలం సృష్టించాడు. ఈ ఘటనలో ఒక సీనియర్‌ రైల్వే అధికారితో సహా మరో ముగ్గురు ప్యాసింజర్లు మృతి చెందారు. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌కు చెందిన చేతన్ సింగ్ (33) అనే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) కానిస్టేబుల్ జైపూర్-ముంబై సెంట్రల్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో సోమవారం ఉదయం తన సర్వీస్‌ రివాల్వర్‌ నుంచి 12 రౌండ్లు కాల్పులు జరిపాడు. అతని సీనియర్ అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ (ASI) తికారమ్ మీనాతోపాటు మరో ముగ్గురు రైల్వే ప్రయాణికులపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. కాల్పుల అనంతరం సింగ్, రైలు అలారం చైన్‌ని లాగి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. వెంటనే అప్రమత్తం అయిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన సోమవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. చేతన్‌ సింగ్‌ జరిపిన 12 రౌండ్లు కాల్పుల్లో అతని రైఫిల్‌తో పాటు ఏఎస్‌ఐ మీనా పిస్టల్ నుంచి కూడా కాల్పులు జరిపాడు. కాల్పులకు గల కారణం ఇంకా తెలియరాలేదు.

పెందుర్తిలో వృద్ధురాలు దారుణ హత్య

విశాఖలో ఓ వృద్దురాలు దారుణ హత్యకు గురైంది. పెందుర్తిలోని సుజాతనగర్‌కు చెందిన వరలక్ష్మి దంపతులు(70) ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుతున్నారు. ఇటీవల వారి వద్ద ఉల్లిపాయలు కట్ చేసే వర్కర్‌గా వెంకటేష్‌ ఉద్యోగంలో చేరాడు. ఈ క్రమంలో వరలక్ష్మి ఇంట్లో డబ్బు ఉందని భావించిన వెంకటేష్‌.. నిన్న రాత్రి ఆమె ముఖంపై దిండుతో అదిమి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న బంగారాన్ని ఎత్తుకెళ్లాడు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పెందుర్తి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. నిందితుడు వృద్ధురాలు నివాసముంటున్న అపార్ట్‌మెంట్‌ లోపలికి వచ్చి బయటకు వెళ్తున్న దృశ్యాలు సీసీ ఫుటేజ్‌లో గుర్తించారు. వీటి ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు గాలిస్తున్నారు. అయితే నెల రోజుల క్రితమే వెంకటేష్‌ పనిలో చేరినట్లు పోలీసులు గుర్తించారు.

బంగారం కోసం వృద్ధురాలిని హతమార్చిన వాలంటీర్‌

విశాఖపట్నంలో దారుణం చోటుచేసుకుంది. వార్డు వాలంటీర్‌ ఘాతుకానికి పాల్పడ్డాడు. బంగారం కోసం ఓ వృద్ధురాలిని హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ ఘటన నగరంలోని పెందుర్తి పరిధిలోని సుజాతనగర్‌లో చోటుచేసుకుంది.పోలీసులు, మృతురాలి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సుజాతనగర్‌లో నివాసముంటున్న కోటగిరి శ్రీనివాస్‌ జీవీఎంసీ 95వ వార్డు పురుషోత్తపురంలో ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నారు. ఆయన వద్ద పురుషోత్తపురం ప్రాంతానికి చెందిన వార్డు వాలంటీర్‌ రాయవరపు వెంకటేశ్‌ (26) పార్ట్‌టైంగా విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో శ్రీనివాస్‌ ఇంటికి వెంకటేశ్‌ వెళ్లాడు. తిరిగి మళ్లీ దుకాణం వద్దకు వెళ్లాడు. అర్ధరాత్రి 12.30 గంటలకు కోటగిరి శ్రీనివాస్‌ ఇంటికి వచ్చి చూసేసరికి ఆయన తల్లి కోటగిరి వరలక్ష్మి (72)అచేతనంగా మంచంపై పడి ఉండటాన్ని గమనించాడు. ఆమె మెడలోని బంగారు గొలుసు కనిపించకపోవడంతో డయల్‌ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించాడు. పెందుర్తి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీ టీవీ ఫుటేజీలో శ్రీనివాస్‌ వద్ద పనిచేస్తున్న వార్డు వాలంటీర్‌ వెంకటేశ్‌ వచ్చి వెళ్లినట్లు అందులో రికార్డయింది.దీంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు దొంగిలించడానికి వాలంటీర్‌ ఆమెను తలగడతో ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.

హైదరాబాద్ ఫిలింనగర్ లో బెంజ్ కారు బీభత్సం

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని ఫిలింనగర్ లో ఓ బెంచ్ కారు బీభత్సం సృష్టించింది.  ఓవర్ స్పీడ్ తో చెట్టు, కరెంటు పోల్, గోడను వరుసగా ఢీ కొట్టుకుంటూ వెళ్లింది. ఆ తరువాత ఓ గుడిసెకు అడుగు దూరంలో ఆగిపోయింది. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో  కారులోని మహిళ ప్రాణాలతో బయటపడింది. గుడిసెలో వాచ్మెన్ ఫ్యామిలీకి తప్పిన ప్రాణాపాయం తప్పింది. రామానాయుడు స్టూడియోకు సమీపంలో ఎలక్ట్రికల్ బెంజ్ కారు ఆదివారం నాడు బీభత్సం సృష్టించింది. మితిమీరిన వేగంతో దూసుకువచ్చిన ఓ కారు అదుపుతప్పి ముందు చెట్టును ఢీ కొట్టింది. అక్కడినుంచి.. కరెంట్ పోల్ ను ఢీ కొట్టింది. అది పూర్తిగా విరిగి కిందపడిపోయింది. ఆ తరువాత గోడను ఢీ కొట్టగా.. అది బ్రేక్ అయ్యింది. కింద అంతా దుబ్బల్లాగా మట్టి, రాళ్లు పేరుకుపోయి ఉండడంతో గోడను ఢీ కొట్టి ఆగిపోయింది. అలా ఆగకపోతే.. నేరుగా ఓ గుడిసెలోకి దూసుకుపోయేదని అక్కడివారు చెబుతున్నారు. ఇద్దరు వ్యక్తుల నివాసం ఉంటున్న ఓ గుడిసెకు ఒక అడుగు దూరంలోనే కారు ఆగిపోయింది. గుడిసెలో వాచ్మెన్ దంపతులు నివసిస్తున్నారు. కారు అదే స్పీడ్ తో వెళ్లుంటే వారిద్దరి ప్రాణాలు గాల్లో కలిసిపోయేవంటున్నారు.

*  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు

మణిపూర్‌లో నగ్నంగా ఊరేగించిన ఇద్దరు మహిళలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించి న్యాయబద్ధమైన, నిష్పక్షపాత ధోరణిలో విచారణ జరిపించాలని అభ్యర్ధించారు. మణిపూర్ అల్లర్లు మొదలైన మరుసటి రోజున ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని వలసపోతున్న ఇద్దరు మహిళలను మొదట వివస్త్రులను చేసి తర్వాత వారిపై అత్యాచారానికి పాల్పడిన సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సంఘటన జరిగి రెండు నెలలు దాటినా కూడా వీడియో బయటకు వచ్చేంతవరకు దర్యాప్తు ప్రారంభం కాకపోవడమే అనేక అనుమానాలకు తావిస్తోంది. సుప్రీంకోర్టు కూడా వీడియో విషయంపై చాలా సీరియస్ అయ్యింది. ఇది పూర్తిగా రాజ్యాంగ వైఫల్యమేనని జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. మణిపూర్ సంఘటన తీవ్రంగా కలచివేసింది. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. మీకు చేతకాకపోతే చెప్పండి మేమే రంగంలోకి దిగుతామని హెచ్చరించింది కూడా. రాష్ట్రంలో మహిళల భద్రత విషయమై మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని.. ఎప్పటికప్పుడు అక్కడి పురోగతి గురించి తమకు తెలపాలని కూడా సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది.

తండ్రిపై మైనర్ కొడుకు కాల్పులు

పంజాబ్ లోని లూథియానాలో ఓ మైనర్ బాలుడు తన తండ్రిపై పిస్టల్ తో కాల్పులు జరిపింది. ప్రస్తుతం తండ్రి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన తండ్రిని రాయకోట్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చిక్సిత కోసం అక్కడి నుంచి డీఎంసీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.వివరాల్లోకెళ్లే.. అకల్‌గఢ్ ఖుర్ద్ గ్రామానికి చెందిన దల్జీత్ సింగ్ తన భార్య, కొడుకుతో కలిసి బంధువును కలవడానికి కారులో వెళ్తున్నాడు.  ఆయన కారు డ్రైవింగ్ చేస్తుంటే.. తన కొడుకు వెనుక సీటులో కూర్చున్నాడు. కొద్దిదూరం చేరుకున్న తరువాత కారులో అకస్మాత్తుగా కాల్పుల శబ్దం వచ్చింది. దల్జీత్ సింగ్ వెనుక నుండి రక్తం కారుతోంది. రక్తాన్ని చూసిన తన భర్త, పిల్లలు ఒక్కసారిగా కేకలు వేశారు. దీంతో చుట్టుపక్కల వారు తీవ్రంగా గాయపడిన దజ్లీత్ సింగ్‌ను మొదట రైకోట్ సివిల్ హాస్పిటల్ తరలించారు. ఆపై DMCకి రిఫర్ చేశారు. బుల్లెట్ అతని వీపులోంచి వెళ్లి పొట్టలోకి చేరుకుంది. వైద్యుల బృందం అతనికి ఆపరేషన్ చేసి బుల్లెట్‌ను బయటకు తీసేందుకు ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం అతని పరిస్థితి విషయంగా ఉందని వైద్యులు తెలియజేశారు. ఈ విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేశారు.  ఈ ఘటన ఆదివారం ఉదయం 11:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని చౌకీ లోహత్‌బడ్డీ ఇన్‌చార్జి సుఖ్వీందర్ సింగ్ తెలిపారు.

స్నేహితుడిని చంపి ఇంట్లోనే పాతిపెట్టిన ఘనుడు

ఇంట్లో మందు పార్టీ అరేంజ్ చేసి ప్రేమతో స్నేహితుడిని ఆహ్వానించి చంపి ఇంట్లోనే పాతి పెట్టాడు ఓ ఘనుడు.. కడప జిల్లా ప్రొద్దుటూరు ఈశ్వర్ రెడ్డి నగర్ లో దారుణం చోటుచేసుకుంది. కిషోర్ అనే వ్యక్తి తల్లి ఇంట్లో లెకపోవడంతో తన స్నేహితుడు సతీష్‌ను మందు తాగుదాం రమ్మని ఆహ్వానించాడు .. ఏమైందో ఏమో తెలియదు కాని కిషోర్ ఇంట్లో సతీష్ శవమై తేలాడు. నెల రోజుల తర్వాత ఇంటికి వచ్చిన కిషోర్ తల్లికి ఇంట్లో దుర్వాసన రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.సుమారు నెల రోజుల క్రితం ఇంట్లో గొడవ పడి స్నేహితుడు కిషోర్ ఇంటికి వెళ్ళిన సతీష్ శవమై తేలాడు. నెల రోజుల క్రితం బంధువుల ఇంటికి వెళ్ళిన కిషోర్ తల్లి ఆదివారమే తిరిగి ప్రొద్దుటూరు వచ్చింది. ఈ క్రమంలో తనకు ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుడటంతో కిషోర్‌ను ఏం జరిగిందంటూ తల్లి గట్టిగా ప్రశ్నించింది. సతీష్‌ను చంపి ఇంట్లో పూడ్చినట్లు కిషోర్ తన తల్లికి చెప్పడంతో సంఘటన వెలుగులోకి వచ్చింది. కిషోర్‌ను అదుపులోకి తీసుకున్న వన్ టౌన్ పోలీసులు విచారించగా సతీష్‌ను చంపి ఇంట్లోనే పూడ్చి పెట్టినట్లు కిషోర్ ఒప్పుకున్నాడు. అయితే ఎందుకు చంపాల్సి వచ్చిందనే విషయంపై ఇంకా క్లారిటీ రావలసి ఉంది.

శ్మశాన వాటికలో అర్థరాత్రి క్షుద్ర పూజల కలకలం

దేశం ఓ వైపు టెక్నాలజీతో దూసుకెళ్తుంటే.. కొన్ని గ్రామాల్లో మాత్రం మూఢ నమ్మకాలు ఇంక ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయి. దయ్యాలు, భూతాలు అంటూ కొందరు అంధ విశ్వాసంలో మునిగి తేలుతున్నారు. నిత్యం ఇలాంటి ఘటనలు ఎక్కడో ఒకచోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా, చేర్యాల మండల పరిధిలోని చుంచనకోట గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు గ్రామ శివారులోని దళితులకు చెందిన శ్మశానవాటికలో క్షుద్ర పూజలు చేశారు. అదే గ్రామానికి చెందిన సూతారి రమేష్ అనే వ్యక్తి కాలకృత్యాలు తీర్చుకునేందుకు అటుగా వెళ్తున్న క్రమంలో శ్మశాన వాటికలో క్షుద్రపూజలు చేస్తున్నట్లుగా గమనించిన రమేష్ గ్రామస్థులకు సమాచారం అందజేశాడు.దీంతో కొంత మంది గ్రామస్థులు శ్మశానవాటిక వైపు వెళ్లగా క్షుద్ర పూజల్లో కూర్చున్న గుర్తు తెలియని వ్యక్తులు వారిని చూసి అక్కడి నుంచి పరారైనట్లుగా గ్రామస్థులు తెలిపారు. కాగా, గ్రామంలో కేవలం నెల రోజుల వ్యవధిలోనే అనారోగం పాలైన ఐదుగురు ఆకస్మికంగా మృతి చెందరాని గ్రామస్థులు తెలిపారు. ఇదే విషయాన్ని గ్రామస్థులు పోలీసులకు కూడా సమాచారం అందించారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరిగితే చూసిన, తెలిసినా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని గ్రామస్థులకు పోలీసులు సూచించారు.

ఆన్ లైన్ లోన్ యాప్ వేధింపులు

ఆన్​లైన్ యాప్​లో​ లోన్ తీసుకుని తిరిగి చెల్లించలేక సిరిసిల్ల జిల్లాకు చెందిన ఓ యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం..  సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన నరేశ్ (23)  శంషాబాద్‌‌‌‌‌‌‌‌కు వచ్చి ఎయిర్ పోర్ట్ లోని సింధూర కంపెనీలో ఏసీ టెక్నీషియన్​గా పని చేస్తూ  ఆర్బీనగర్ లక్కీ డీలక్స్ హాస్టల్‌‌‌‌‌‌‌‌లో ఉంటున్నాడు. కొద్ది నెలల  కింద ఓ యాప్​ నుంచి  లోన్  తీసుకున్నాడు. అయితే, లోన్​ చెల్లించేలక ఒత్తిడికి లోనై ఆదివారం హాస్టల్ లో పురుగుల మందు తాగాడు. అతడిని ఫ్రెండ్స్ దవాఖానకు తరలించగా అప్పటికే చనిపోయాడని డాక్టర్లు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు  చేస్తున్నారు.