బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ రేపు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. రేపు ఉదయం 10:30కు బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి 11 గంటల 15 నిమిషాలుకు కొల్హాపూర్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.. అక్కడ నుంచి సాంగ్లీ జిల్లా వాటేగావ్ తాలూకా కేంద్రంలో దళిత నేత అన్నా భావ్ సాఠే జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. 12.45 నిమిషాలకు అన్నబాయ్ సాటే విగ్రహానికి కేసీఆర్ నివాళ్లు అర్పించనున్నారు. మధ్యాహ్నం 1 గంటలకు అన్నాభావ్ సాఠే కుటుంబ సభ్యుల ఇంటికి వెళ్లి.. 1.30 నిమిషాలకు ఇస్లాంపూర్ లోని రఘునాధ్ దాదా పాటిల్ ఇంట్లో భోజనం చేయనున్నారు.
ఇక, సీఎం కేసీఆర్ సాంగ్లీ జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ ప్రముఖలతో కూడా సమావేశం కానున్నారు. అనంతరం కొల్హాపూర్‌లోని మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తారు.. కొల్హాపూర్‌లోని దేవీ అంబాబాయి దర్శనం అనంతరం తిరిగి హైదరాబాద్ చేరుకొంటారు. సాయంత్రం 5 గంటలకు కొల్హాపూర్ ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి హైదరాబాద్ కు ఆయన తిరుగు పయనం అవుతారు.అయితే, మహారాష్ట్ర యుగకవిగా, దళిత సాహిత్య చరిత్రలో ఆద్యుడిగా అన్నాభావ్ సాఠే పేరొందారు. సాఠే వాటేగావ్‌లోనే 1920, ఆగస్టు ఒకటో తేదీన జన్మించారు. డాక్టర్ బాబా సాహేబ్ అంబేద్కర్ స్ఫూర్తితో దళిత ఉద్యమంలో చేరారు. అంబేద్కర్ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అన్నాభావ్ సాఠే అనేక రచనలు చేశారు. సంయుక్త మహారాష్ట్ర ఉద్యమంలో ఆయన కీలకపాత్ర పోషించారు. ఇక, సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనలో తెలంగాణలోని మాంగ్ సమాజ్ ప్రజలు పాల్గొనాలని మాంగ్ సమాజ్ రాష్ట్ర అధ్యక్షులు గైక్వాడ్ తులసీదాస్ పిలుపునిచ్చారు.