ScienceAndTech

వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్ అదుర్స్

వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్ అదుర్స్

వాట్సాప్‎లో మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. కెమెరా ఆప్షన్ లోకి వెళ్లకుండానే షార్ట్ వీడియోను పంపించే కొత్త ఫీచర్ త్వరలో అందుబాటులోకి రానుంది. ఇప్పటివరకు వాట్సప్ చాట్‎లో షార్ట్ ఆడియోను పంపించే ఫీచర్ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక తాజాగా వాట్సప్ అప్డేటెడ్ వర్షన్‎లో షార్ట్ వీడియోను పంపించే కొత్త ఫీచర్ను వాట్సాప్ అందుబాటులోకి తీసుకురానుంది. దీని ద్వారా వాట్సప్ చాట్‎లో నుండి వీడియోను రికార్డ్ చేసి షార్ట్ వీడియోను ఇతరులకు షేర్ చేసుకోవచ్చు. కొద్ది వారాల్లోనే ఈ కొత్త ఫీచర్ మీ వాట్సాప్ ఫోన్లోకి అందుబాటులోకి రానుంది. వీడియో మెసేజ్ వచ్చిన తర్వాత 60 సెకండ్ల లోపే ఆ వీడియోపై స్పందించడానికి వీలు ఉండేలా రియల్ టైం మార్గాన్ని కనుగొంటున్నారు. ఈ ఫార్మేట్ ఇప్పటికే స్నాప్ చాట్‎లో అందుబాటులో ఉంది. స్నాప్ చాట్ తర్వాత షార్ట్ వీడియో ఫ్యూచర్ ను అందుబాటులోకి తీసుకు వస్తున్న ప్లాట్ ఫాం వాట్సాప్ మాత్రమే.

వాట్సాప్ లో షార్ట్ వీడియో మెసేజ్ ను పంపడం ఎలా ?త్వరలో అందుబాటులోకి రానున్న ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందని దానిపై వాట్సాప్ ఇప్పటికే ఒక ప్రకటన చేసింది. ఒక వ్యక్తికి షార్ట్ వీడియో మెసేజ్‎ను వాట్సప్ ద్వారా పంపించేందుకు మొదట వాట్సాప్ చాట్‎ను ఓపెన్ చేయాలి. ఏ వ్యక్తికి వీడియో మెసేజ్ పంపాలనుకుంటున్నారో ఆ వ్యక్తి చాట్ బాక్స్ ఓపెన్ చేసి మీ ఫోన్లో ఉన్న మైక్రోఫోన్ ఐకాన్ ని ట్యాప్ చేయాలి. ఆ వ్యక్తికి వీడియో మెసేజ్ పంపించేందుకు మైక్రోఫోన్ బటన్ని హోల్డ్ చేసి వీడియో రికార్డ్ చేయాలి. ఇప్పటివరకు మైక్రోఫోన్ బటన్ని హోల్డ్ చేసి పట్టుకుంటే కేవలం మన ఆడియో మెసేజ్ ని మాత్రమే పంపించగలిగాము. కానీ వాట్సాప్ అప్డేటెడ్ ఫీచర్ వల్ల మైక్రోఫోన్ బటన్ అలాగే హోల్డ్ చేసి పట్టుకుంటే ఆడియోతో పాటు వీడియో మెసేజ్ కూడా పంపించుకునే వీలు ఉంటుంది. వీడియో రికార్డ్ చేయడం అయిపోగానే హోల్డ్ చేసి పట్టుకున్న బటన్‎ని రిలీజ్ చేయాలి. అవతల వ్యక్తికి వీడియో మెసేజ్ మ్యూట్ ఫార్మేట్ లోనే ప్లే అవుతుంది.