అమ్మఒడి, అంబులెన్స్, పార్థివదేహాల తరలింపు వాహనాలను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. మంగళవారం నగరంలోని పీపుల్స్ టోల్‌ప్లాజా వద్ద 466 అత్యవసర వాహనాలను(228 అమ్మ ఒడి, 204 అంబులెన్స్, 34 పార్థివ) సిఎం కెసిఆర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతా కుమారి, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మీ, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.కాగా, అత్యాధునిక సదుపాయాలున్న కొత్త వాహనాల రాకతో ప్రజలకు మరింత వేగంగా, విస్తృతంగా వైద్యసేవలు అందనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు నుంచి ఈ కొత్త వాహనాలు ప్రజలకు సేవలు అందించనున్నాయి.