ఆరోగ్య ప్రయోజనాలు
- పెరుగు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ప్రతి రోజు పెరుగును ఆహారంగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
- బీట్ రూట్ బీపీని క్రమబద్దీకరిస్తుంది.
- మునగాకు తింటే గ్యాస్ట్రిక్ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది.
- జామపళ్ళు ఎక్కువగా తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
- ప్రోస్టేట్ క్యాన్సర్ సోకకుండా అడ్డుకునే శక్తి టొమాటోలకు ఉంది.
- నేరేడు పండ్లు తింటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి.
- మొలల వ్యాధికి బొప్పాయి మంచి మందు.
- మునగ కాయలు ఆకలిని పెంచుతాయి.
- సపోటా పండ్లు మలబద్దకాన్ని నివారిస్తాయి.
- దాల్చిన చెక్కకు పంటి నొప్పిని తగ్గించే శక్తి ఉంది.
- ఆవాలు అజీర్తిని తగ్గిస్తాయి.
- కమలాఫలాలు న్యుమోనియాకు చక్కని మందు.
- క్యారెట్లు నరాల బలహీనత నుండి కాపాడతాయి.
- యాపిల్ తింటే నిద్ర బాగా పడుతుందని పరిశోధనలో తేలింది.
- వాము దంత వ్యాధులను తగ్గిస్తుంది.
- దానిమ్మరసం కామెర్లకు మంచి మందుగా పనిచేస్తుంది.
- ఆవాల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ వృద్ది చెందుతుంది.
- అల్లం కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది.