* అజయ్ రెడ్డి సాక్షిలపై నారా లోకేశ్ మరో న్యాయపోరాటం
టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ మరోసారి న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. అసత్య కథనాలు ప్రచురించిందంటూ సాక్షి పైనా… కట్టుకథలతో ఆరోపణలు చేశారంటూ అప్పటి స్కిల్ డెవలప్ మెంట్ విభాగం చైర్మన్ అజయ్ రెడ్డి పైనా కోర్టులో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు మంగళగిరి మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో క్రిమినల్ కేసులను దాఖలు చేసిన లోకేశ్, వాంగ్మూలం నమోదుకు శుక్రవారం(4-8-2023) నాడు కోర్టుకు హాజరు కానున్నారు. దాంతో రేపు పాదయాత్రకు విరామం ప్రకటించారు. ప్రస్తుతం లోకేశ్ యువగళం పాదయాత్ర ఉమ్మడి గుంటూరు జిల్లాలో సాగుతుండగా… పాదయాత్ర నుంచి గురువారం రాత్రి ఉండవల్లి నివాసానికి చేరుకుని, శుక్రవారం ఉదయం మంగళగిరి కోర్టుకి లోకేశ్ హాజరవుతారు. స్కిల్ డెవలప్ మెంటులో భారీ స్కాం అంటూ అప్పటి చైర్మన్ అజయ్ రెడ్డి 2022లో ప్రెస్ మీట్ పెట్టి నారా లోకేశ్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే, తనకు సంబంధం లేని అంశంపై అసత్య ఆరోపణలు చేశారంటూ లోకేశ్ తన న్యాయవాదులతో అజయ్ రెడ్డికి నోటీసులు పంపారు. అటునుంచి ఎటువంటి సమాధానం లేకపోవడంతో…. తన పరువుకి భంగం కలిగించారంటూ అజయ్ రెడ్డిపై తగు చర్యలు తీసుకోవాలని మంగళగిరి కోర్టులో లోకేశ్ క్రిమినల్ కేసు దాఖలు చేశారు.
* కేసీఆర్ పై వైఎస్ షర్మిల సెటైర్లు
సీఎం కేసీఆర్ పై వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. అందరూ సీఎంలు ప్రమాణ స్వీకారం తర్వాత హామీలు నెరవేరిస్తే కేసీఆర్ కు మాత్రం ఎన్నికల ముందే హామీలు గుర్తుకొస్తాయని అన్నారు. నాలుగేళ్ల గడీల్లో మొద్ద నిద్రపోయిన సీఎం కేసీఆర్..ఓట్ల కోసం అటకమీద దాచిన ఫేనిఫెస్తో తిరగేస్తున్నారని అన్నారు. ఈ నాలుగున్నరేళ్లలో బీఆర్ఎస్ నేతకలకు దాచుకోవడం, దాచుకోవడమే సరిపోయిందని అన్నారు. రుణమాఫీకి డబ్బుల్లేక మూడు నెలల ముందే కొత్త టెండర్లకు వేలం నిర్వహిస్తున్నారని ఆరోపించారు. రేట్లు, ట్యాక్స్ పెంచి ప్రజల రక్తం తాగడం చాలదన్నట్లు ఇప్పుడు మద్యం టెండర్లు ముందుగానే నిర్వహిస్తున్నారని చెప్పారు.‘‘అదే చేతితో డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వండి. నిరుద్యోగ భృతి ఇవ్వండి. వరద బాధితులను ఆదుకోండి. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వండి. చట్ట సభల్లో బీసీలకు 33%, మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేయండి. ఆగిపోయిన దళిత బంధును, మైనార్టీ బంధును అమలు చేయండి. బీసీల్లోని అన్ని కులాలకు బీసీ బంధు ఇవ్వండి. ఎన్నికలకు ముందే రెండు దఫాల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చి నిరూపించుకోవాలి’’ అని షర్మిల డిమాండ్ చేశారు.
* ఏపీలో జగన్ మాత్రమే సింహం
40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబుకు సురక్ష లాంటి కార్యక్రమం చేయాలని ఆలోచన ఎందుకు రాలేదని ప్రశ్నించారు వైసిపి తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్. ఎన్టీఆర్, రాజశేఖర్ రెడ్డిల తరువాత రాష్ట్రంలో సంక్షేమానికి టార్చ్ బేరర్ గా జగన్ ఉన్నారని పేర్కొన్నారు. అడవిలో చాలా జంతువులు ఉంటాయి.. కానీ ఒక్క సింహమే రాజు.. ఏపీలో జగన్ మాత్రమే సింహం అని అన్నారు.నక్కలు ఎన్ని గుంపులుగా వచ్చినా జగన్ సింగిల్ గా మరల సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఎవరిని పంపిస్తావో పంపిచ్చు… ప్రజలు సంతోషంగా ఉండటానికి జగన్ కారణం అని చెపుతారన్నారు. టిడిపి నేతలు స్ధాయి మరిచి జగన్ గురించి మాట్లాడతారని.. బీహార్, శ్రీలంక లతో పోల్చకుండా వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. యువగళంలో జనాలను తరలిస్తున్నారే తప్ప వాళ్ళు రావడం లేదన్నారు. టిడిపి కార్పొరేటర్ల డివిజన్లలో కూడా మేం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు దేవినేని అవినాష్.
* ఏపీలో ఈ రెండు యూనివర్సిటీలు ఫేక్
యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) బుధవారం నాడు భారతదేశంలోని 20 విశ్వవిద్యాలయాలను నకిలీవిగా ప్రకటించింది. ఈ సంస్థలకు విద్యార్థులకు ఎలాంటి డిగ్రీలు మంజూరు చేయడానికి అధికారం లేదని పేర్కొంది. ‘‘యూజీసీ చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా అనేక సంస్థలు డిగ్రీలు అందిస్తున్నట్లు యూజీసీ దృష్టికి వచ్చింది. అటువంటి విశ్వవిద్యాలయాలు అందించే డిగ్రీలు ఉన్నత విద్య లేదా ఉద్యోగ ప్రయోజనాల కోసం గుర్తించబడవు లేదా చెల్లుబాటు కావు. ఈ విశ్వవిద్యాలయాలకు ఏదైనా డిగ్రీని ప్రదానం చేసే అధికారం ఉండదు’’ అని యూజీసీ కార్యదర్శి మనీష్ జోషి ఒక ప్రకటనలో తెలిపారు.ఈ విశ్వవిద్యాలయాలలో అత్యధికంగా ఢిల్లీలో 8 ఉన్నాయి. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రెండు యూనివర్సిటీలు కూడా ఉన్నాయి. గుంటూరులోని జిల్లా కాకుమానివారితోటలో క్రైస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ ఒకటి కాగా.. మరొకటి విశాఖపట్నంలోని బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా. ఇక, క్రైస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీకి అడ్రస్.. 7వ లేన్, కాకుమానువారితోటో, గుంటూరు, ఆంధ్రప్రదేశ్-522002, మరొక అడ్రస్ నెం. 301, గ్రేస్ విల్లా ఆప్ట్స్, 7/5, శ్రీనగర్, గుంటూరు. ఇక, బైబిల్ ఓపెన్ యూనివర్శిటీ ఆఫ్ ఇండియా అడ్రస్.. హౌస్ నెంబర్. 49-35-26, ఎన్జీవోస్ కాలనీ, విశాఖపట్నం ఈ విధంగా నకిలీ యూనివర్సిటీల వివరాలను ప్రకటించడం ద్వారా.. గుర్తింపు లేని, మోసపూరిత సంస్థల నుండి విద్యను అభ్యసించే ఉచ్చులో పడకుండా విద్యార్థులను రక్షించడం యూజీసీ ప్రధాన లక్ష్యం. విశ్వవిద్యాలయాల్లో నమోదుకు ముందు.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వాటి అక్రిడిటేషన్ స్థితిని ధృవీకరించడం చాలా ముఖ్యం.
* అడ్వాన్స్ బుకింగ్స్ లో మరోసారి ట్రెండ్ సృష్టిస్తున్న మహేష్ సినిమా..
తెలుగులో రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతుంది.గత ఏడాది మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఆయన కెరీర్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ‘పోకిరి’ సినిమాని 4K రిజల్యూషన్ లో ఎంతో గ్రాండ్ గా విడుదల చేసారు.ఆ సినిమా ఏకంగా కోటి 75 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి ఆల్ టైం రికార్డు నెలకొల్పింది.. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ‘జల్సా’ సినిమాను రీ రిలీజ్ చేయగా ఆ సినిమా పోకిరి కలెక్షన్స్ ని అధిగమించింది.ఆ తర్వాత చాలా సినిమాలు విడుదల అయ్యాయి కానీ ఒక్కటి కూడా ఈ రెండు సినిమాల అంత ఇంప్యాక్ట్ ను క్రియేట్ చేయలేకపోయాయి.ఆ తరువాత పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన కెరీర్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఖుషి సినిమాని రీ రిలీజ్ చేసారు.ఈ చిత్రం రీ రిలీజ్ లో కూడా ప్రభంజనం సృష్టించింది.ఏ సినిమా అందుకోలేని అరుదైన రికార్డుని నెలకొల్పింది. మొదటి రోజు నాలుగు కోట్ల 20 లక్షల రూపాయిల గ్రాస్ ని రాబట్టింది.అలాగే ఫుల్ రన్ లో 8 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టింది.
* బండి సంజయ్ ను అభినందించిన ప్రధాని మోదీ
ఇటీవల బీజేపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాలలో భాగంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి బండి సంజయ్ ను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. బీజేపీ తనపై చూపించిన నమ్మకానికి పొంగిపోయిన బండి సంజయ్ తగు రీతిలో బీజేపీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలియచేశారు. అంతే కాకుండా ఈ రోజు ఢిల్లీ వెళ్లిన బండి సంజయ్ కుటుంబ సమేతంగా ప్రధాని మోదీని కలుసుకున్నారు. బండి ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత మోదీని కలవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ .. శభాష్ బండి సంజయ్ తెలంగాణాలో పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో చాలా కష్టపడ్డావు అంటూ అభినందించారు. ఇంకా ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మరింతగా కస్టపడి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని మోదీ బండి సంజయ్ కు చెప్పారు. దీనితో బండి సంజయ్ పై మరింతగా బాధ్యత పెరిగింది అని చెప్పాలి.ఇక ఇతని స్థానంలో కిషన్ రెడ్డిని జెడ్పీ చీఫ్ గా నియమించిన సంగతి తెలిసింది. మరి కేసీఆర్ ను తట్టుకుని వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందా అంటే అనుమానమే
* ఢిల్లీలో బండి సంజయ్‌ని కలిసిన చీకోటి ప్రవీణ్