Agriculture

పాక్ బియ్యానికి గిరాకీ

పాక్ బియ్యానికి గిరాకీ

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌ (Pakistan)కు బియ్యం ఎగుమతులపై భారత్ విధించిన నిషేధం కాసులవర్షం కురిపిస్తోంది. పాకిస్థాన్ బియ్యానికి డిమాండ్ పెరిగింది. అమెరికా, బ్రిటన్, ఐరోపా దేశాల నుంచి ఆర్డర్లు వస్తున్నట్లు ఎగుమతిదారులు చెబుతున్నారు. పాకిస్థాన్ నుంచి ఈ ఏడాది బియ్యం ఎగుమతులు 3బిలియన్ డాలర్లకు చేరనున్నట్లు అంచనా వేస్తున్నారు.