తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటు వంటి సింగరేణి కార్మికులకు తీపికబురు అందింది. మే 19న జరిగిన 11వ వేతన సవరణ ఒప్పందాన్ని యాజమాన్యం అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. 23 నెలల బకాయిలు ఈ నెల వేతనంతో కలిపి సెప్టెంబర్ లో చెల్లించని ఉందని సమాచారం. 19% మినిమం గ్యారంటీ బెనిఫిట్, 25% అలవెన్స్ లను చెల్లించనుందట.దీంతో ఫస్ట్ కేటగిరి కార్మికుడికి రూ. 12 వేల వరకు జీతం పెరగనుంది. దీనిపై సింగరేణి యాజమాన్యం త్వరలో ప్రకటన చేయనుందని వార్తలు వస్తున్నాయి. ఇక అటు జూనియర్ పంచాయతీ కార్యదర్శులు(జేపీఎస్)లకు సర్కార్ తీపికబురు చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలోని 9,350 మంది జేపీఎస్ క్రమబద్ధీకరణకు మార్గం సుగమమైనట్లు తెలిపింది. వారిని నాల్గో గ్రేడ్ పంచాయతీ కార్యదర్శులుగా ఫీడర్ కేటగిరీలో గుర్తించేందుకు పంచాయతీరాజ్ సబార్డినేట్ నిబంధనలను సడలిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.