ScienceAndTech

విజయవంతంగా చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్‌-3

విజయవంతంగా చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్‌-3

చంద్రుడి దక్షిణ ధ్రువంపై పరిశోధనల కోసం చంద్రయాన్ -3 ప్రయోగాన్ని ఇస్రో చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రయోగం కీలక ఘట్టానికి చేరుకుంది. ప్రస్తుతం భూమి చుట్టూ పలుమార్లు తిరిగిన చంద్రయాన్ -3 ఎట్టకేలకు విజయవంతంగా చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించింది. ఈ విషయాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇక వివరాల్లోకి వెళ్తే జులై 14న ప్రయోగించిన చంద్రయాన్ – 3 చంద్రుని దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే చంద్రయాన్ – 3 భూమి చుట్టు కక్షలను విజయవంతగా పూర్తి చేసుకున్న అనంతరం చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించింది. అయితే చంద్రుని వైపు వెళ్తున్న ఈ వ్యోమనౌక ఇప్పటికే ముడింట రెండు వంతుల ప్రయాణాన్ని పూర్తిచేసుకున్నట్లు శుక్రవారం రోజున ఇస్రో శాస్త్రవేత్తలు చెప్పారు. మరో ముఖ్య విషయం ఏంటంటే ఆగస్టు 23వ తేదిన చంద్రునిపై ఈ ల్యాండర్ అడుగుపెట్టనుంది.ప్రస్తుతం ఈ వ్యోమనౌక పనితీరు బాగానే ఉందని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చంద్రుని కక్ష్యలోకి వెళ్లిన తర్వాత.. ఆ కక్ష్యలో తిరుగుతుందని.. ఈ నెల 23న చంద్రునిపైనా దీన్ని ల్యాండ్ చేస్తామని పేర్కొ్నారు. అయితే చంద్రునిపై దిగే సమయంలో ఈ విక్రమ్ ల్యాండర్ తన సొంతంగానే నిర్ణయాలను తీసుకుంటుందని ఇస్రో తెలిపింది. వాస్తవానికి చంద్రయాన్ -2 లోని విక్రమ్ ల్యాండర్‌కు అలాగే చంద్రయాన్ – 3 లోని విక్రమ్ ల్యాండర్‌కు ఇదే ప్రధానమైన తేడా అని చెప్పింది. గతంలో చంద్రయాన్ – 2 విఫలమైన సంగతి అందరికీ తెలిసిందే. ఆ మిషన్ చంద్రునిపై ల్యాండింగ్ అయ్యే సమయంలో చంద్రుని ఉపరితలాన్ని బలంగా ఢీకొంది. దీంతో చివరికి ఆ విక్రమ్ ల్యాండర్‌లో ఉన్న వ్యవస్థలు పనిచేయకుండా పోయాయి. అయితే ఇప్పుడు మాత్రం ల్యాండర్‌ను మెరుగ్గా అభివృద్ధి చేసి జాబిల్లి పైకి పంపింది ఇస్రో.