WorldWonders

పాకిస్థాన్ రికార్డ్‌ను తిరగరాసిన భారత్

పాకిస్థాన్ రికార్డ్‌ను తిరగరాసిన భారత్

సాధారణంగా మనం ఒక్క వాల్‌నట్‌ పగలగొట్టడానికే నానా యాతన పడుతాం. అలాంటిది 273 వాల్‌నాట్స్‌ను.. కేవలం 60 సెకన్లలో అదీ నుదుటితో పగలగొట్టి గిన్నిస్‌ రికార్డు సృష్టించాడు మన దేశానికి చెందిన నవీన్‌. పాకిస్థాన్‌కు చెందిన మహ్మద్‌ రషీద్‌ గతంలో నిమిషంలో 254 వాల్‌నాట్స్‌ను నుదుటితో పగలగొట్టి గిన్నిస్‌ రికార్డు సాధించాడు. తాజాగా మన దేశానికి చెందిన ఎస్‌.నవీన్‌కుమార్‌ ఆ రికార్డును తిరగరాశాడు. బల్లలపై వరుసగా ఉంచిన 273 వాల్‌నాట్స్‌ను కేవలం 60 సెకన్లలో పగలగొట్టి కొత్త రికార్డు నెలకొల్పాడు. గతంలో ఇటలీలో ఒకే వేదికపై రషీద్‌తో నవీన్‌ తలపడ్డాడు. అప్పుడు 239 వాల్‌నాట్స్‌ మాత్రమే పగలగొట్టగలిగాడు. అనంతరం ఐదేళ్ల తర్వాత రషీద్ పేరు ఉన్న రికార్డును తిరగరాశాడు. దీనికి సంబంధించిన వీడియోను గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ సంస్థ తన ట్విటర్‌ హ్యాండిల్‌లో ఉంచింది.