ఆంధ్రప్రదేశ్‌లో 18 రైల్వే స్టేషన్లలో రూ.453.5 కోట్ల విలువైన అభివృద్ది పనులకు వర్చువల్‌గా ప్రధాని నరేంద్రమోడీ శంకుస్థాపనలు చేశారని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి వెల్లడించారు. భారతదేశం యొక్క పురోగతికి, ఆర్థిక వృద్ధిని పెంపొందించడానికి…పర్యాటకాన్ని పెంపొందించడానికి, సామాజిక బంధాలను బలోపేతం చేయడానికి దేశవ్యాప్తంగా 508 అమృత్ భారత్ స్టేషన్లకు శంకు స్థాపన చేయడం గొప్ప విషయం అని దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. బహుళ అంతస్తుల స్టేషన్ బిల్డింగ్‌లు, లిఫ్టులు, ఎస్కలేటర్లు, సదుపాయాలతో నిర్మాణాలు ప్రజల భవిష్యత్తు అవసరాలు కోసం మోడీ ముందు చూపుకు నిదర్శనం అని దగ్గుబాటి పురంధేశ్వరి వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం ట్వీట్ చేశారు.