Health

ఆపిల్ బీట్ క్యారెట్ జ్యూస్ తప్పనిసరిగా తాగుతున్నారా?

ఆపిల్ బీట్ క్యారెట్ జ్యూస్ తప్పనిసరిగా తాగుతున్నారా?

ABC జ్యూస్‌తో మీ రోజును స్టార్ట్ చేయండి. ఎంతో రుచితో పాటు మరెన్నో పోషకాలను అందించే ఈ జ్యూస్ గురించి తెలుసుకోవాలని ఉందా?

యాపిల్ (Apple), బీట్ రూట్ (Beetroot), క్యారెట్‌ల (Carrot) మిశ్రమమే ABC జ్యూస్. ఈ జ్యూస్ ని తాగడం వల్ల మీ శరీరానికి కావాల్సిన శక్తి వస్తుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ జ్యూస్‌లో ఎలాంటి పోషకాలు ఉన్నాయంటే?

ABC జ్యూస్‌లో ‘ఎ’ మరియు ‘సి’ విటమన్లు ఉన్నాయి. బీట్ రూట్‌లోని ఐరన్, పొటాషియం..క్యారెట్‌లోని బీటా-కెరోటిన్ అవసరమైన పోషకాలను అందిస్తుంది. యాపిల్‌లో ఉండే నేచురల్ సుగర్ తక్షణ శక్తిని అందిస్తుంది. రోజంతా ఏకాగ్రతతో ఉండేలా సహాయపడుతుంది. క్యారెట్‌లో డైటరీ ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది.

ABC జ్యూస్‌లో విటమిన్ ‘సి’ కంటెంట్ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. దాంతో అనారోగ్యాలు దరి చేరవు. ఈ జ్యూస్‌లోని విటమిన్లు కణాలకు రక్షణ ఇస్తాయి. ఆరోగ్యకరమైన చర్మం, మరియు జట్టు పెరుగుదలకు సహకరించి మీ అందాన్ని మరింత ఇనుమడింప చేస్తాయి. ఈ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలంటే .. పరిశుభ్రంగా ఉన్న మిక్సీ జార్‌లోకి 1 1/2 కప్పుల క్యారెట్ ముక్కలు, 3/4 కప్పు బీట్‌రూట్ ముక్కలు, 1/2 కప్పు యాపిల్ ముక్కలు (పొట్టు తీసినవి), 1/2 టేబుల్ స్పూన్ తరిగిన అల్లం, 1 స్పూన్ నిమ్మరసం, 1 కప్పు నీరు తీసుకుని మిక్సీ పట్టండి. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న ABC జ్యూస్‌ను తయారు చేసుకోండి. మీ ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి.