Health

ఆయుర్వేదంలో కొలస్ట్రాల్ తగ్గించడానికి టిప్స్

ఆయుర్వేదంలో కొలస్ట్రాల్ తగ్గించడానికి టిప్స్

ప్రస్తుతం ఓవర్ వెయిట్ చాలా ఇబ్బంది పెట్టే ప్రాబ్లమ్. అసలు ఎన్ని ఎక్సర్ సైజులు చేసినా..ఫుడ్ కంట్రోల్ చేసినా ఏం చేసినా తప్పట్లేదు ఈ బరువు బాధ. కొన్ని ఆయుర్వేదంలో కొలస్ట్రాల్ తగ్గించడానికి కొన్ని కిటుకులున్నాయి . వాటిని ఫాలో అయితే చాలు …కొలస్ట్రాల్ మైనం లాంటి పదార్థం. మన శరీర పనితీరుకను కొలెస్ట్రాల్‌ అవసరం. కొలెస్ట్రాల్‌ మన శరీరంలో సెల్‌ మెంబ్రేన్‌, హార్మోన్లు, విటమిన్‌ డీ తయారు చేయడానికి తోడ్పడుతుంది.

కొలెస్టాల్‌ రెండు రకాలు.. LDL (తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్), HDL (హై డెన్సిటీ లిపోప్రొటీన్). LDL ను చెడు కొలెస్ట్రాల్‌, HDL ను మంచి కొలెస్ట్రాల్‌ అని పిలుస్తారు. మన రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ తక్కువగా ఉండాలి, మంచి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండాలి. అప్పుడే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ ఎక్కువైతే.. ఇది క్రమంగా రక్త నాళాలలో పేరుకుపోతుంది, వాటిని అడ్డుకుంటుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉంటే.. హైపర్‌టెన్షన్‌, అధిక బరువు, గుండె పోటు, స్ట్రోక్‌, నడుము నొప్పులు, కీళ్ల నొప్పులు, వెన్నునొప్పులు, కిడ్నీ, మెదడుకు సంబంధిత సమస్యలు వచ్చే ముప్పు పెరుగుతుంది. గుండెకు స్టంట్లు ..ఓపెన్ హార్ట్ సర్జరీలు..హార్ట్ ఎటాక్ లు అన్నీ..

గుగ్గులు..ఆయుర్వేదంలో కొలెస్ట్రాల్‌ను కరిగించడానికి గుగ్గులు ను ఉపయోగిస్తారు.  ఈ మొక్కలో గుగ్గుల్‌స్టిరోన్‌ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ స్థాయిలను కరగించడంలో తోడ్పడుతుంది. కాని అంత తేలికగా అరుగుదలకు కాదు ..అర్జున బెరడులో ఫ్లేవనాయిడ్స్‌, అర్జునోనిక్‌ యాసిడ్‌ ఉంటుంది. ఇవి రక్తంలో కొలెస్ట్రాల్‌ స్థాయిలను కరిగిస్తుంది. అధిక కొలెస్ట్రాల్‌ సమస్యతో బాధపడేవారు..అర్జున బెరడును పాలలో మరిగించి తాగితే మేలు జరుగుతుంది.​ అయితే ఏది అతి కాకూడదు. మోతాదుకు మించి తీసుకోకూడదు.మెంతులు..అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడేవారికి మెంతులు సహాయపడతాయి. మెంతులలోని సోపోనిన్సు రక్తంలో కొలెస్ట్రాల్‌ తగ్గటానికీ తోడ్పడుతాయి. రాత్రి పూట నీళ్లలో మెంతులు నానబెట్టి, ఉదయం ఖాళీ కడుపుతో ఆ నీళ్లు తాగితే మేలు జరుగుతుంది.

అశ్వగంధ..అశ్వగంధ ఒత్తిడిని తగ్గిస్తుంది, శరీర రక్త నాళాలను సమతుల్యం చేస్తుంది, తద్వారా కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. మీరు అధిక కొలెస్ట్రాల్‌ సమస్యతో బాధపడుతుంటే.. ఒక చెంచా అశ్వగంధ పొడిని వేడి పాలలో వేసుకుని తాగితే మంచిది. వెల్లుల్లి..వెల్లుల్లిని తరచుగా తీసుకుంటే.. రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ప్రచురించిన ది మెకానిజమ్స్ రెస్పాన్సిబుల్ ఫర్ గార్లిక్‌ అనే పరిశోధన ప్రకారం వెల్లుల్లి కొలెస్ట్రాల్‌ను దాదాపు 7 శాతం తగ్గిస్తుంది. వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది, ఇది కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది.

రోజుకు రెండు రెబ్బలు వెల్లుల్లి తింటే మేలు జరుగు ఉసిరిలోని విటమిన్‌ సి, యాంటీఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్‌ స్థాయిలను నియంత్రిస్తాయి. దీనిలోని క్రోమియం గుండె కవాటాలు మూసుకుపోకుండా నివారిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మీరు రోజు ఖాళీ కడుపుతో ఉసరి పొడిని గోరువెచ్చని నీళ్లలో వేసుకుని తాగితే మేలు జరుగుతుంది. ఇవి మీ బరువు ఇట్టే తగ్గిస్తాయని కాదు ..ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చక్కగా నిదానంగా ఆరోగ్యంకరంగా తగ్గిస్తుంది. సో ట్రై చేసి చూడండి…