Politics

విద్యుత్ ఉద్యోగులతో చర్చలకు ప్రభుత్వం పిలుపు

విద్యుత్ ఉద్యోగులతో చర్చలకు ప్రభుత్వం పిలుపు

ఆగస్టు 9 అర్థరాత్రి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు. ఏపీ ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు సిద్ధమయ్యారు. 12 డిమాండ్లతో ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే సమ్మె విరమిస్తామని తెలిపారు. ఉద్యోగులు సమ్మెకు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాన్నిదని, చర్చలకు పిలిస్తే వస్తామని విద్యుత్ జేఏసీ ప్రకటించింది.తమ సమస్యలను అర్థం చేసుకోవాలని వినియోగదారులను విద్యుత్ ఉద్యోగులు కోరారు. దీంతో చర్చలకు రావాలని విద్యుత్ ఉద్యోగులకు ప్రభుత్వం ఆహ్వానం పంపింది. సాయంత్రం నాలుగు గంటలకు చర్చలకు రావాలని పిలిచింది. విద్యుత్ ఉద్యోగులతో సిఎస్, మంత్రుల కమిటీ చర్చలు జరపనుంది.