ఫార్మా రంగానికి హైదరాబాద్ క్యాపిటల్‌గా మారిందని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. నగరం నుంచే ప్రపంచానికి వ్యాక్సిన్లు సరఫరా చేస్తున్నామని చెప్పారు. శంషాబాద్ విమానాశ్రయంలోని జీఎంఆర్ ఇన్నోవేక్స్ సెంటర్‌లో ‘తెలంగాణ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కూలింగ్ అండ్ కోల్డ్ చైన్’ కేంద్రాన్ని కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
‘‘ఈ కేంద్రానికి పరిశోధన పరంగా సహాయం చేయనున్నట్లు యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్‌హామ్ ప్రకటించింది. ప్రపంచంలో దేనిని ఆపగలిగినా.. వ్యవసాయ రంగాన్ని మాత్రం ఆపలేమని సీఎం కేసీఆర్ ఎప్పుడూ చెప్తుంటారు. ఈ తొమ్మిదేళ్లలో వ్యవసాయరంగ ఉత్పత్తి, ఎగుమతులు ఎంతో పెరిగాయి. సస్టైనబుల్ కూలింగ్‌ను ప్రోత్సహించడమే ఈ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ముఖ్య ఉద్దేశం. ల్యాబ్, కమ్యూనిటీ కూలింగ్ హౌస్ వంటివి ఈ సెంటర్‌లో ఏర్పాటు చేస్తున్నాం. ఇటువంటి కూలింగ్ సొల్యూషన్స్ మనకు దేశంలో ఇంకా కావాలి. రైతులు పండించే ఆహార పదార్థాలు భద్రపరిచేందుకు కూడా ఈ కేంద్రం ఉపయోగపడుతుంది’’ అని కేటీఆర్ అన్నారు.