భారతీయుల కోసం జర్మనీ జారీ చేస్తున్న షెంజెన్ వీసా ప్రక్రియ సమయం ఎనిమిది వారాలకు తగ్గించినట్లు జర్మనీ రాయబార కార్యాలయం డిప్యూటీ హెడ్ ఆఫ్ మిషన్ జార్జ్ ఎన్జ్వైలర్ తెలిపారు. ఆ గడువును మరింత కుదించే ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ‘వీసా ఒక ముఖ్యమైన అంశం. మేము దరఖాస్తులకు పట్టే సమయాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాం. అందుకు వివిధ మార్గాల ద్వారా కృషి చేస్తున్నాం. ముంబయిలో మా సిబ్బంది సంఖ్యను పెంచాం. దాంతో వీసా కోసం వేచి చూసే సమయం గణనీయంగా తగ్గనుందని’ జార్జ్ చెప్పారు.
ఇక భారతీయులకు వేగంగా జర్మన్ షెన్జెన్ వీసా
Related tags :