పందెం గిత్తల అమ్మకాలు, కొనుగోళ్లలో ఇదో అరుదైన సంఘటన. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన సుంకి సురేందర్‌రెడ్డి (ఏసీపీ హైదరాబాద్) తాను పెంచుకున్న గిత్తల్లో ఒక జతను రూ.కోటికి అమ్మారు. ఏపీలోని బాపట్ల జిల్లా కొల్లూరు మండలం అనంతారం గ్రామానికి చెందిన ఓ రైతు ఇటీవల రూ. కోటి చెల్లించి వీటిని సొంతం చేసుకున్నారు. భీముడు, అర్జునుడుగా పిలిచే ఈ రెండు కోడెలు.. తెలుగు రాష్ట్రాల్లో గడిచిన 9 నెలల్లో జరిగిన 40కి పైగా పోటీల్లో పాల్గొన్నాయి. వాటిలో 34 సార్లు ప్రథమ బహుమతి గెలుచుకున్నాయి. తన అనుభవం ప్రకారం.. ఇంత ధర పలికిన గిత్తల జత లేదని సురేందర్‌రెడ్డి తెలిపారు.