ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచెంది. ఆయా జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని మూడు జిల్లాలకు కాంగ్రెస్ పార్టీ డీసీసీ చీఫ్‌లను నియమించింది. ఈ మేరకు మూడు జిల్లాలకు డీసీసీ చీఫ్ లను ఏఐసీసీ ప్రకటించింది. జనగామ డీసీసీ అధ్యక్షుడిగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, నిర్మల్ జిల్లాకు శ్రీహరిరావు, భువనగిరి జిల్లాకు సంజీవరెడ్డిలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.