Politics

గూగుల్‌ క్రోమ్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలని కేంద్రం హెచ్చరిక

గూగుల్‌ క్రోమ్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలని కేంద్రం హెచ్చరిక

గూగుల్‌ క్రోమ్‌ను వెంటనే అప్‌డేట్‌ చేసుకోవాలని కేంద్రం యూజర్లను హెచ్చరించింది. కొన్ని వెర్షన్లకు ఫిషింగ్‌, డాటా దాడులు, మాల్‌వేర్‌ ఇన్‌ఫెక్షన్లు కలిగే ప్రమాదం ఉన్నదని వెల్లడించింది.ప్రాంప్ట్స్‌, వెబ్‌ పేమెంట్స్‌ ఏపీఐ, వీడియో, వెబ్‌ ఆర్‌టీసీ ఫీచర్లకు ప్రమాదం కలగవచ్చని.. వెంటనే క్రోమ్‌ తాజా వెర్షన్‌కు అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది. హానికరమైన వెబ్‌సైట్లను యూజర్లు సందర్శిస్తే వారి కంప్యూటర్లు హ్యాకర్ల చేతిలోకి వెళ్లి వారి వ్యక్తిగత సమాచారం చోరీకి గురయ్యే ప్రమాదం ఉన్నదని పేర్కొంది.