NRI-NRT

డీసీలో గుమ్మడికి సన్మానం

డీసీలో గుమ్మడికి సన్మానం

ఏపీ నాటక కళా పరిషత్ మాజీ చైర్మన్, గుమ్మడి గోపాలకృష్ణను అమెరికా రాజధాని డీసీలో భాను మాగులూరి అధ్యక్షతన, ప్రవాసాంధ్రుల తలిదండ్రుల సమక్షంలో సత్కరించారు.

ఈ సందర్భంగా గోపాలకృష్ణ మాట్లాడుతూ. మాతృ దేశానికి సుదూరంగా ఉంటున్నా, ప్రవాస భారతీయులు అమెరికాలో సైతం, మాతృ భాషను మరువకుండా, ఆ మూలలను వదలకుండా తమ పిల్లలకు.. తెలుగు నేర్పుతూ, భాషాభిమానం విషయంలో ముందుండటం అభినందనీయమన్నారు. పద్యం తెలుగు వారికి మాత్రమే సొంతం. ఏ రూపంలో ఉన్న కళ అనేది మానవాళికి క్రమశిక్షణ, వివేకం, విచక్షణ అలవరుస్తుందన్నారు. రంగస్థల కళాకారులను ప్రోత్సహిస్తున్న డా- మూల్పూరి వెంకట్రావుకి, ప్రవాస సంఘాల కార్యవర్గ సభ్యులకు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు. సభికుల కోరిక మేరకు హరిశ్చంద్ర, మహాభారతంలోని కొన్ని సందర్భోచిత పద్యాలను గోపాలకృష్ణ ఆలపించారు.