NRI-NRT

హవాయిలో ఆరని మంటలు

హవాయిలో ఆరని మంటలు

అమెరికాలోని హవాయి దీవిలో ఏర్పడిన భీకర కార్చిచ్చు పెను నష్టాన్ని మిగిల్చింది. లహైనా రిసార్టు నగరంలో ఈ ప్రకృతి విపత్తు సృష్టించిన బీభత్సం కారణంగా మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కార్చిచ్చుకు ఇప్పటివరకు 55 మంది ప్రాణాలు కోల్పోయినట్లు హవాయి గవర్నర్‌ జోష్‌ గ్రీన్‌ తెలిపారు. ఈ కార్చిచ్చు కారణంగా 150 ఏళ్ల నాటి భారీ మర్రి చెట్టు పెనుముప్పును ఎదుర్కొంటోంది. ఇప్పటికే చెట్టుకు సంబంధించి చాలా భాగాలు కాలిపోయినట్లు చిత్రాలను బట్టి తెలుస్తోంది. అయితే చెట్టు ఇప్పటికీ నిలిచే ఉంది. భారత్‌ నుంచి దిగుమతి చేసుకున్న ఎనిమిది అడుగుల మర్రి మొక్కను 1873లో లహైనా కోర్టుహౌస్‌, హార్బర్‌ ఎదుట పాతారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న అతి పురాతన భారీ మర్రి వృక్షాల్లో ఇదొకటి. ప్రస్తుతం 60 అడుగుల ఎత్తున్న ఈ మర్రి చెట్టును నాటి ఈ ఏడాది ఏప్రిల్‌కు 150 ఏళ్లు పూర్తయ్యాయి.