Politics

కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేసిన కిషన్ రెడ్డి

కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేసిన కిషన్ రెడ్డి

సీఎం కేసీఆర్‌పై తెలంగాణ బీజేపీ చీఫ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీలో ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా టీ బీజేపీ మహా ధర్నా చేపట్టింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ రాజ్యంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మాటలకే పరిమితం అయ్యాయని విమర్శించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలో కేసీఆర్ సర్కార్ పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్‌కు ప్రజలను నమ్మించి గొంతు కొయ్యడం వెన్నతో పెట్టిన విద్య అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పాలన అవినీతిమయమైందని.. కల్వకుంట్ల కుటుంబం చేతిలో తెలంగాణ బంది అయ్యిందని ఫైర్ అయ్యారు. ఎన్నికలకు ముందు గారడీ చేయడం సీఎం కేసీఆర్‌కు బాగా అలవాటని ఎద్దేవా చేశారు.