స్కాట్లాండ్ అనేది గ్రేట్ బ్రిటన్ యొక్క ఉత్తర భాగంలో ఉన్న ఒక దేశం.
కారణం ఏమిటో తెలియదు కానీ.. స్కాట్లాండ్లోని ఇన్వర్క్లైడ్ జిల్లాలో కవలల జనన రేటు ఎక్కువగా ఉంది.
అందుకే ఇన్వర్క్లైడ్ జిల్లాను ట్విన్వర్క్లైడ్ అని పిలుస్తుంటారు.
ఈ జిల్లాలో 2015 సంవత్సరంలో 19 జతల కవల పిల్లలు కలిసి ఒకే స్కూల్ లో ఒకే టైంలో అడ్మిషన్ తీసుకోవడం మీడియా దృష్టిని ఆకర్షించింది.
తాజాగా ఈ సంవత్సరం కూడా ఇన్వర్క్లైడ్ జిల్లాలోని గ్రీనాక్ పట్టణంలో ఉన్న సెయింట్ పాట్రిక్స్ ప్రైమరీ స్కూల్ లో 17 జతల ట్విన్స్ ఒకే టైంలో అడ్మిషన్స్ తీసుకున్నారు. వారిలో 15 జతల ట్విన్స్ కలిసి ఒకేచోట కూర్చొని దిగిన ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. స్కాట్లాండ్లోని ఇన్వర్క్లైడ్ జిల్లాలోని అన్ని ప్రాథమిక పాఠశాలల్లో కలుపుకొని మొత్తం 147 జతల కవల పిల్లలు చదువుతున్నారు. తాజాగా మరో 17 జతల కవలలు కొత్తగా స్కూల్ అడ్మిషన్ తీసుకోవడంతో ఈ సంఖ్య మరింత పెరిగింది. ఇన్వర్క్లైడ్ జిల్లాలోనే ఉన్న ఆర్డగోవాన్ ప్రైమరీ స్కూల్ లో అత్యధిక సంఖ్యలో కవల పిల్లలు చదువుతున్నారు. ఈ స్కూల్ లోని ప్రతి ప్రైమరీ క్లాస్ లో కవల పిల్లల జంటలు సగటున 3 చొప్పున ఉన్నాయి. ఈనేపథ్యంలో ఏటా కొత్తగా అడ్మిషన్స్ పొందే కవల పిల్లలకు(17 Sets Of Twins) ఆహ్వానం పలకడానికి స్కూళ్లలో స్పెషల్ సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నారు.