దక్షిణాఫ్రికాలో ఉన్న ప్రవాస భారతీయులు స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. సౌత్ ఆఫ్రికాలో ఇండియాడే సందర్బంగా స్వాతంత్ర దినోత్సవ సంబురాలలో టాసా సభ్యులు పాల్గొన్నారు. ఒకరినొకరు అభినందించుకున్నారు. పరస్పరం ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఆనందోత్సాహాలతో, ఉల్లాసంగా స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నారు. దక్షిణాఫ్రికా రాజధాని జోహెన్స్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియంలో ఈ ఉత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాల్లో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా (టాసా) తరపున తెలంగాణ సంస్కృతీ సంప్రదాయలు ఉట్టిపడేలా పలు కార్యక్రమాలను తెలంగాణ మహిళలు ప్రదర్శించారు.టాసా ప్రెసిడెంట్ తాళ్లూరి శ్రీనివాస్ మాట్లాడుతూ విదేశాల్లో నివసిస్తున్నా తాము తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను అందరికి తెలిసేలా పని చేస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో శివ శంకర్ (చక్రం) నృత్య రీతులను కూర్చారు తెలంగాణ బతుకమ్మ పాటలకు శ్రేయ బండారు ,ప్రియాంక గుర్రాల, లక్ష్మి కుప్పు,తేజ రంగ, కవిత అప్పం ప్రదర్శన ఇచ్చారు