77వ భారత స్వాతంత్య్ర దినోత్సవం పురసర్కరించుకుని యావత్ భారతదేశంలోనే గాదు విదేశాల్లో వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ మేరకు యూకేలో స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలకి సంబంధించిన ఒక వీడియో ఆన్‌లైన్‌తో తెగ ఆకర్షిస్తోంది. ఆ వీడియోలో ఓ సంగీత కళాకారుడు ” మా తుఝే సలాం”, ‘సందేసే ఆతే హై’ ‘తేరీ మిట్టి’ వంటి పాటలతో యూకేలోని భారతీయలును అలరించాడు. యూకే వీధులన్ని స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలతో సందడిగా మారాయి.యూకేలో ఈ వేడుకను భారతీయులు, పాకిస్తానీయులు కలిసి జరుపుకోవడం విశేషం. ముఖ్యంగా బ్రిటీష్ సామ్రాజ్యం ముంగిటే ఈ వేడుకలను భారతీయులు పాకిస్తానీయులు ఘనంగా జరుపుకోవం మరింత విశేషం. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవ్వగానే నెటిజన్ల అంతా ఈ స్వాతంత్య్ర దినోత్సవం అత్యంత విశేషమైనది. భారతీయుల దేశభక్తి పాటలతో యూకే వీధులు మారుమ్రోగాయి.భారతమాత బానిస సంకెళ్లను తొలగించుకుని స్వేచ్ఛవాయువులను పీల్చుకున్న ఈ శుభదినాన్ని రవి అస్తమించిన బ్రిటీష్ సామ్రాజ్యం ముందే సగర్వంగా జరుపుకోవడం అత్యంత సంతోషంగా ఉంది. ఇది అత్యంత భావోద్వేగకరమైన క్షణం అంటూ అక్కడున్న భారతీయులందర్నీ ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు.