ప్రముఖ సినీ నటుడు చిరంజీవి మోకాలికి స్వల్ప శస్త్రచికిత్స జరిగింది. రెండు రోజుల క్రితం దిల్లీలోని ఓ ఆసుపత్రిలో ఈ చికిత్స చేయించుకున్నారు. మోకాలిలో తరచూ నొప్పి రావడంతో పరీక్షలు చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎలాంటి కోత లేకుండానే ఆర్థ్రోస్కోపిక్ విధానంలో ఇన్ఫెక్షన్ తొలగించినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారని, నాలుగైదు రోజుల్లో హైదరాబాద్కు తిరిగి రానున్నట్లు ఆయన పీఆర్ బృందం తెలిపింది.