పొద్దున లేవగానే చాలామంది కోల్గేట్ బ్రష్ పట్టుకొని పండ్లను గబగబ తోముతూ ఉంటారు. కానీ పూర్వకాలంలో మాత్రం ఇవేవీ లేవు. కేవలం వేప పూల్లలే పండ్లను శుభ్రం చేసుకోవడానికి ప్రధానమైనటువంటి బ్రష్.. దాని ద్వారానే ప్రతి ఒక్కరు పండ్లను శుభ్రం చేసుకునేవారు. మరి అలాంటి వేప పుల్ల వేసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని డాక్టర్లు అంటున్నారు.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
వేప చెట్టు ఎన్నో ఔషధ గుణాలు కలిగినటువంటి వృక్షం. వేప ఆకులు, వేప పూలు, వేప బెరడు, వేప పాలు, వేపకాయలు ఇవన్నీ మనకు ఎంతో ఉపయోగపడతాయి. ముఖ్యంగా వేప చెట్టు పుల్లలతో ప్రతిరోజు మనం దంతాలను శుభ్రం చేసుకుంటే మన పళ్ళు పటిష్టంగా ఉండటమే కాకుండా ఎంతో క్లీన్ అవుతాయట. మన పల్లెలో ఉండేటువంటి బ్యాక్టీరియా కూడా చనిపోయి పళ్ళు బలంగా ఉండటానికి ఉపయోగపడుతుందట.అలాగే చిగుళ్లలో ఎలాంటి సమస్యలు ఉండవు. నాలుగు చుక్కల ఆవాల నూనెలో ఉప్పు కలిపి వేప పుల్లతో బ్రష్ చేస్తే దంతాలు శుభ్రం అవుతాయి. చిగుళ్ళు కూడా బలంగా తయారవుతాయి. దీనివల్ల నోటి దుర్వాసన దంతక్షయం, చీము, వంటి సమస్యలు కూడా పోతాయని డాక్టర్లు అంటున్నారు. వేప పుల్లతో మనం పళ్ళు శుభ్రం చేసుకోవడం వల్ల చెవులు, మెదడు కూడా ఆరోగ్యంగా ఉంటుందట. అంతేకాకుండా ముఖం కాంతివంతంగా మారుతుందని నిపుణులు అంటున్నారు.