విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్లాల్సిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్(Vande Bharat Express)ను నేడు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. గురువారం ఉదయం 5.45కి బయల్దేరాల్సిన రైలును సాంకేతిక కారణాలతో రద్దు చేసినట్లు చెప్పారు. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామన్నారు. వందేభారత్ రద్దు సమాచారాన్ని ఉదయం 5 గంటల నుంచి ప్రయాణికులకు చేరవేసినట్లు తెలిపారు. ప్రత్యామ్నాయంగా ఉదయం 7 గంటలకు మరో రైలును ఏర్పాటు చేశామని.. వందేభారత్ స్టాపుల్లోనే అది ఆగుతుందని తెలిపారు. వందేభారత్ రద్దుతో ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.