మనలో చాలామంది ఉదయం లేవగానే పరగడుపున నిమ్మరసం నీళ్లు తీసుకుంటారు. ఇలా తీసుకోవడం వలన మన ఆరోగ్యానికి అనేక ఉపయోగాలున్నాయి. అలాగే రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది . ఎందుకంటే దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, కాల్షియం ఉంటాయి. నిమ్మరసాన్ని ఉదయం తీసుకోవడం వలన మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..
* ఉదయం పూట నిమ్మరసం నీళ్లు తాగడం వలన మన శరీరంలోని వ్యర్థాలను, టాక్సిన్స్ ను తొలగిస్తాయి.
* గ్యాస్ట్రిక్ సమస్యలకు చెక్ పెడుతుంది.
* నిమ్మకాయలతోపాటు ఇతర సిట్రస్ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇన్ఫెక్షన్ల నుంచి విటమిన్ సి శరీరాన్ని రక్షిస్తుంది.
* మనల్ని ఆరోగ్యంగా ఉంచి రోజంతా యాక్టివ్‌గా ఉండేలా చేస్తుంది.
* నిమ్మకాయలో ఉండే పెక్టిన్ ఫైబర్ తీసుకుంటే ఆకలిని తగ్గిస్తుంది.. దీని వల్ల బరువు ఈజీగా తగ్గుతారు.